NTV Telugu Site icon

Layoff : టెస్లాలో కొనసాగుతున్న లేఆఫ్.. మరో 10 శాతం ఉద్యోగుల తొలగింపు..

Layofff

Layofff

గత ఏడాది, ఈ ఏడాది ఆర్థిక కారణాల వల్ల పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించుకొనే పనిలో ఉన్నారు.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులను తగ్గించుకున్నారు.. ఈ ఏడాది కూడా ఎక్కువగా ప్రముఖ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పటికే ఎన్నో కంపెనిలు ఉద్యోగుల ఉచకోత మొదలు పెట్టారు.. తాజాగా మరో కంపెనీ కూడా ఉద్యోగులను తొలగించనుంది..

ప్రముఖ కంపెనీ టెస్లా ఇప్పటికే రెండుసార్లు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు మరోసారి తమ ఉద్యోగులను భారీగా తొలగిస్తుందని తెలుస్తుంది.. 10 శాతం మంది సిబ్బందిని తొలగించిన టెస్లా.. తాజాగా మరింత మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోంది.. 603 మంది ఉద్యోగులను తొలగించాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..

ఎలాన్ మస్క్ ప్రకటించిన గ్లోబల్ ఉద్యోగ కోతల్లో భాగంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌లలో 6,020 మందిని తొలగించనున్నట్లు తెలిసిందే.. ఇటీవల ఈ కార్ల తయారీ, విక్రయాల రేట్లు బాగా పడిపోయింది. విక్రయాలు పెంచడం కోసం ధరలను తగ్గించింది. త్వరలో అందుబాటు ధరలో కొత్త కార్లను తీసుకురానున్నట్లు టెస్లా తెలిపింది. మరోవైపు ఖర్చులను తగ్గించేందుకు పెద్ద ఎత్తున తమ కంపెనీలను ఉద్యోగులను తొలగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను తొలగించే పనిలో ఉందని సమాచారం.. ఈ ఊచకోత ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..