Site icon NTV Telugu

OnlyFans: జాబ్ అంటే ఇది కదా.. ఓన్లీఫ్యాన్స్ ప్రతి ఉద్యోగికి రూ. 330 కోట్ల ఆదాయం..

Onlyfans

Onlyfans

డిజిటల్ కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రసిద్ధి చెందిన ఓన్లీఫ్యాన్స్ (OnlyFans), ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ స్టాండర్డ్స్ తో ముందుండటం విశేషం. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రతి ఉద్యోగికి సగటున $37.6 మిలియన్లు (సుమారు ₹330 కోట్లు) ఆదాయాన్ని సృష్టిస్తోందని, ఫైనాన్షియల్ ఫర్మ్ బార్‌చార్ట్ (Barchart) నివేదిక పేర్కొంది. ఇది టెక్ జెయింట్స్‌లైన ఆపిల్ (Apple) $2.4 మిలియన్లు, ఎన్విడియా (NVIDIA) $3.6 మిలియన్లు వంటి ఆదాయాల కంటే అత్యంత ఎక్కువ. ఈ అద్భుతమైన ఆదాయం ఓన్లీఫ్యాన్స్‌ను ప్రపంచంలోని అత్యంత సామర్థ్యవంతమైన కంపెనీగా నిలబెట్టింది.

Also Read:ఎర్రవల్లి ఫార్మ్ హౌస్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై కేసీఆర్ కీలక సమావేశం!

ఓన్లీఫ్యాన్స్ అనేది సబ్‌స్క్రిప్షన్ ఆధారిత కంటెంట్ ప్లాట్‌ఫారమ్. క్రియేటర్లు (సృష్టికర్తలు) తమ వీడియోలు, ఫోటోలు, ఇతర కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి, యూజర్ల నుంచి పేమెంట్ తీసుకుంటారు. ప్లాట్‌ఫారమ్ ఈ లావాదేవీలపై 20% కమిషన్ తీసుకుంటుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో దీని మొత్తం ఆదాయం $1.3 బిలియన్లు (సుమారు ₹11,000 కోట్లు) అని నివేదికలు తెలిపాయి. ఈ కంపెనీలో కేవలం 40-42 మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారు. ఇది ప్లాట్‌ఫారమ్‌ను క్రియేటర్లు, యూజర్లు నడుపుతున్నారని, కంపెనీ సిబ్బంది పరిమితంగా ఉండటం వల్ల ఆదాయ ప్రామాణికత భారీగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఓన్లీఫ్యాన్స్ ఆదాయం ఆపిల్‌కు 15 రెట్లు, ఎన్విడియాకు 10 రెట్లు ఎక్కువ. ఎన్విడియా AI చిప్‌లతో, ఆపిల్ ఐఫోన్‌లతో ప్రపంచాన్ని శాసిస్తున్నప్పటికీ, ఓన్లీఫ్యాన్స్ యూజర్-జెనరేటెడ్ కంటెంట్ మోడల్‌తో ఈ రికార్డు సృష్టించింది. ఈ విజయానికి కారణాలు ఏంటంటే.. ఓన్లీఫ్యాన్స్‌లో పెద్ద ఫ్యాక్టరీలు లేవు, పెద్ద R&D టీమ్ లేదు. క్రియేటర్లు కంటెంట్ సృష్టిస్తారు, ప్లాట్‌ఫారమ్ కేవలం ట్రాన్సాక్షన్లను హ్యాండిల్ చేస్తుంది.

Also Read:Rohit-Kohli: అరరే రో-కో.. అడిలైడ్‌లో సీన్ రివర్స్ అయిందే!

పాండమిక్ తర్వాత, ఆన్‌లైన్ కంటెంట్ డిమాండ్ పెరిగింది. మిలియన్ల మంది క్రియేటర్లు (అందరూ ప్రొఫెషనల్స్ కాదు) ఈ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతున్నారు. యూఎస్, యూరప్, భారత్‌లో కూడా జనాదరణ పెరుగుతోంది. ఉక్రెయిన్ వంటి దేశాల్లో కూడా ఈ ప్లాట్‌ఫారమ్ ఆదాయాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నాయని నివేదికలు ఉన్నాయి.

Exit mobile version