Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2029 తర్వాత దేశంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో కీటో మోటార్స్ ఈవీ బస్సును తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టే లక్ష్యంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈవీల వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు 40 దేశాల నుంచి జరిగే పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం 73 శాతం విద్యుత్ బొగ్గు ఆధారితమేనని, భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. ఇందులో భాగంగా ఏపీలో అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్, రూ. లక్ష కోట్లతో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు చేపడతామని, చైనాపై ఆధారాన్ని తగ్గించుకోవడానికి రూ. 3,600 కోట్లతో క్రిటికల్ మినరల్స్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నామని చెప్పారు.
Also Read
- AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
- Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
- Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
- Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
అదే కార్యక్రమంలో TGSRTC ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీ 1,050 ఈ-బస్సులు నడుపుతోందని, ‘పీఎం ఈ-డ్రైవ్’ కింద మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోల్, డీజిల్ వాహనాలు భారీగా తగ్గుతాయని, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోందని వివరించారు.
తాజావార్తలు
-
Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Spider Man: భారత్‌లో ‘స్పైడర్ మ్యాన్’ సునామీ… రూ. 500 కోట్ల క్లబ్‌పై మార్వెల్ కన్ను
-
AP Govt: ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త.. రూ. 50 వేల వరకు వడ్డీ లేని రుణం..
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!