NTV Telugu Site icon

Putta Mahesh Kumar: పోలవరంపై చంద్రబాబుకు మాత్రమే అవగాహన ఉంది..

New Project (48)

New Project (48)

చంద్రబాబు నాయుడుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ దెబ్బతిందో తెలిస్తే ఒక అవగాహన వస్తుందని పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తిచేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందన్నారు. వైయస్సార్సీపి ప్రభుత్వంలో ప్రాజెక్టు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఆరోపించారు. ఇప్పుడు తప్పుడు కథనాలతో కొన్ని చానల్స్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.

READ MORE: Shoaib Akhtar: రోహిత్ శర్మ, కోహ్లి రిటైర్మెంట్ పై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

2020లో వరదలు రావడం వల్ల అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డాం దెబ్బతిన్నాయని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. యూఎస్ కెనడా నుంచి సైంటిస్టులు వచ్చి పోలవరాన్ని పరిశీలన చేసి ఒక రిపోర్ట్ ను ఇస్తారని వెల్లడించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత రెండు మూడు సీజన్లో పూర్తవుతుందో లేదో క్లారిటీ వస్తుందని స్పష్టం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ వైపు ఎవరిని కూడా అనుమతించలేదన్నారు. 2014 వరకు 6% , ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం హయాంలో 72% వరకు పనులు జరిగాయన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక 3.87 మాత్రమే పనులు జరిగాయని పేర్కొన్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్, తదితర అంశాల పైన ఇన్వెస్టిగేషన్ వేస్తామని.. తద్వారా నిజానిజాలు బయటికి వస్తాయన్నారు. జల శక్తి, హైకోర్టు కూడా పోలవరం ప్రాజెక్టు పైన చెప్పారు.. ఎక్కడ కూడా అవినీతి జరగలేదని.. వైయస్సార్ సీపీ నాయకులు మాత్రం తప్పుడుగా ప్రచారం చేస్తున్నారన్నారు. 2013లో ల్యాండ్ యాక్ట్ వచ్చిందని..6000 కోట్లతో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, 33 వేల కోట్లు తో ప్రాజెక్ట్ వ్యయ నిర్ధారణ అయ్యిందని గుర్తుచేశారు. 2021 లోగా ప్రాజెక్ట్ కాని పూర్తయి ఉంటే 4 వేల కోట్లతో సరిపోయేదన్నారు. స్టీల్ సిమెంట్ ఇసుక తదితర ధరలు పెరగడం వల్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రేట్లు కూడా మారాయని స్పష్టం చేశారు.