Site icon NTV Telugu

BHEL: జాబ్ సెర్చ్ లో ఉన్నారా?.. 10th అర్హతతో భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో 515 జాబ్స్ రెడీ.. మంచి జీతం

Job

Job

టెన్త్ అర్హతతో ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో ఆర్టిసన్ గ్రేడ్-IV పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 515 పోస్టులను భర్తీ చేయనున్నది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమన్ పోస్టులు భర్తీచేయనున్నారు. జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో టెన్త్‌ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ/ఎన్‌టీసీ + ఎన్‌ఏసీ కలిగి ఉండాలి.

Also Read:Infinix Hot 60 5G+: యూత్, గేమింగ్ యూజర్లే టార్గెట్ గా బడ్జెట్ మొబైల్ ను లాంచ్ చేసిన ఇన్‌ఫినిక్స్..!

జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ వారికి 27 ఏళ్లు, ఓబీసీ వారికి 30 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు మించకూడదు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,500 -రూ.65,000 జీతం అందిస్తారు. జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1072 (రూ.600 పరీక్ష + రూ.400 ప్రాసెసింగ్ + GST), ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ రూ.472 (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే) దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 12 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Exit mobile version