తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీలో (FSL) వివిధ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థులను ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 60 పోస్టులను భర్తీ చయనున్నారు. సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ అసిస్టెంట్లు, లాబొరేటరీ టెక్నీషియన్లు, లాబొరేటరీ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు.
Also Read:Indigo: క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకుంటున్న ఇండిగో, ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికులు ఫైర్ !
భర్తీకానున్న పోస్టుల్లో సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు ఫిజికల్/జనరల్ 2, కెమికల్ 3, బయాలజీ/సెరోలజీ 3, కంప్యూటర్స్ 2 పోస్టులు.. సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్/జనరల్ 5, కెమికల్ 10, బయాలజీ/సెరోలజీ 10, కంప్యూటర్స్ 7 పోస్టులు ఉన్నాయి. లాబొరేటరీ టెక్నీషియన్ విభాగంలో ఫిజికల్/జనరల్ 2, కెమికల్ 6, బయాలజీ/సెరోలజీ 4, కంప్యూటర్స్ 5, లాబోరేటరీ అటెండెంట్ 1 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
వయోపరిమితి
1 జులై 2025 నాటికి 18 సంవత్సరాలు నిండాలి, 34 సంవత్సరాలు మించకూడదు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు (5 సంవత్సరాలు), ఎక్స్-సర్వీస్‌మెన్ (3 సంవత్సరాలు + సేవా కాలం), SC/ST/BC/EWS (5 సంవత్సరాలు), ఆర్థోపెడిక్‌లీ హ్యాండిక్యాప్డ్ (OH) (10 సంవత్సరాలు) వయోసడలింపు ఉంటుంది. మహిళలకు (పోస్ట్ కోడ్ 59-63): SC/ST: 40 సంవత్సరాలు, ఇతరులు: 35 సంవత్సరాలు.
అకడమిక్ అర్హతలు (పోస్ట్-వైజ్, మినిమమ్ 65% లేదా 60% మార్కులు)
సైంటిఫిక్ ఆఫీసర్ (పోస్ట్ కోడ్ 51-54): M.Sc. (ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ/ఫోరెన్సిక్ సైన్స్/కంప్యూటర్ సైన్స్) + బ్యాచిలర్ డిగ్రీ.
సైంటిఫిక్ అసిస్టెంట్ (పోస్ట్ కోడ్ 55-58): B.Sc. (సంబంధిత సబ్జెక్టులు) + M.Sc.
ల్యాబరేటరీ టెక్నీషియన్ (పోస్ట్ కోడ్ 59-62): B.Sc. (MPC/BiPC) + డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబరేటరీ టెక్నాలజీ.
ల్యాబరేటరీ అటెండెంట్ (పోస్ట్ కోడ్ 63): ఇంటర్మీడియట్ (MPC/BiPC).
మెడికల్ స్టాండర్డ్స్: దృష్టి – రైట్/లెఫ్ట్ ఐ: డిస్టెంట్ 6/6, నియర్ 0/5. పూర్తి విజన్ ఫీల్డ్, కలర్ బ్లైండ్‌నెస్/స్క్వింట్ లేకుండా ఉండాలి.
ఇతర అర్హతలు: తెలంగాణ రాష్ట్ర లోకల్ అభ్యర్థులు మాత్రమే. కమ్యూనిటీ సర్టిఫికెట్ (SC/ST/BC/EWS), BC నాన్-క్రిమీ లేయర్ (01-04-2025 తర్వాత), EWS సర్టిఫికెట్ (01-04-2025 తర్వాత), OH సర్టిఫికెట్ (Annexure V), FSLలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ (ప్రాధాన్యత).
ఎంపికా ప్రక్రియ వెయిటేజ్ మార్కులు (70 మార్కులు): అకడమిక్ స్కోర్ (SSC, ఇంటర్, గ్రాడ్యుయేషన్, PG), MPhil/PhD, FSL వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా.
రాత పరీక్ష (30 మార్కులు): వెయిటేజ్ మార్కుల ఆధారంగా 1:5 రేషియోలో షార్ట్‌లిస్ట్. డిస్క్రిప్టివ్ పేపర్ (1 గంట). 100 మార్కులు (వెయిటేజ్ + రిట్టెన్) మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్, బయోమెట్రిక్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
శాలరీ వివరాలు
సైంటిఫిక్ ఆఫీసర్.. నెలకు రూ. 45,960 -రూ. 1,24,150
సైంటిఫిక్ అసిస్టెంట్..నెలకు రూ. 42,300 – రూ.1,15,270
ల్యాబరేటరీ టెక్నీషియన్.. నెలకు రూ. 24,280 – రూ.72,850
ల్యాబరేటరీ అటెండెంట్..నెలకు రూ. 20,280 -రూ. 62,110
Also Read:Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్
దరఖాస్తు ఫీజు
సైంటిఫిక్ ఆఫీసర్/అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ఫీజు SC/ST – రూ.1000, ఇతరులు – రూ.2000.
ల్యాబరేటరీ టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తు ఫీజు SC/ST – రూ. 600, ఇతరులు – రూ. 1200.
ల్యాబరేటరీ అటెండెంట్ దరఖాస్తు ఫీజు SC/ST – రూ. 500, ఇతరులు – రూ.1000.
