Site icon NTV Telugu

Online Adult Content: అంబర్‌పేటలో ‘లైవ్ న్యూడ్’ వీడియోల వ్యాపారం.. దంపతుల అరెస్ట్..!

Online Live

Online Live

Online Adult Content: హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో దంపతులు కలిసి నిర్వహిస్తున్న లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపుతోంది. పక్కా ప్రణాళికతో నిర్వాహకుల్లా వ్యవహరిస్తూ, ఆన్ లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ.. డబ్బు తీసుకుని ప్రజలకు లింక్ పంపుతున్న ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో బట్టబయలైంది. ఈ దంపతులు గత నాలుగు నెలలుగా “స్వీటీ తెలుగు కపుల్ 2027” అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ ఫారమ్‌ లలో తమ న్యూడ్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు.

Read Also:Instagram Reel Stunt: రిల్స్ కోసమే రిస్క్? శంకర్‌పల్లిలో రైల్వే ట్రాక్ మీద కారు!

ఇందుకు సంబంధించి లైవ్ లింక్ చూడాలంటే రూ.2000 వసూలు చేస్తున్నారు. అలాగే రికాడ్ వీడియోల కోసం రూ.500 ఛార్జ్ చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా వీడియో షూట్ కోసం తమ నివాస భవనంపై ప్రత్యేకంగా కెమెరాలు, లైటింగ్, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలతో కూడిన సెటప్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తెలిపింది. ఇక అధికారులు అందిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ దంపతుల ఇంటిపై దాడి చేశారు.

Read Also:WI vs AUS: విండీస్ బౌలర్ల దెబ్బకు విలవిలాడిన ఆసీస్ బ్యాటర్స్..!

ఈ దాడిలో కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు, లింక్ షేరింగ్ కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అధికారులు దంపతులను అదుపులోకి తీసుకుని సంబంధిత ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అంబర్‌పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు, ఆన్లైన్‌లో శృంగార కార్యకలాపాలకు పాల్పడటం, ఇతరులకు షేర్ చేయడం, పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం చేయడం కఠిన నేరం అని తెలిపారు. ఇకపై ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని వెల్లడించారు.

Exit mobile version