NTV Telugu Site icon

Onion Seedlings: ఉల్లినారు నాటేందుకు చిట్కాలు, తెగులు నివారణ చర్యలు..

Onioin

Onioin

మన దేశంలో అధికంగా పండించే పంటలలో ఉల్లి సాగు కూడా ఒకటి.. మార్కెట్ లో ఒకసారి ఉన్న ధరలు మరోసారి ఉండవు.. పెరుగుతుందేమో అని రైతులు ఎక్కువగా ఉల్లిని సాగుచేస్తున్నారు.. నారు మొక్కలు పెంచడానికి ఎంచుకున్న భూమిని నేలకు 6 అంగుళాల ఎత్తులో బెడ్డుల రూపంలో మట్టిని పోసుకోవాలి. బెడ్డుకి, బెడ్డుకి మధ్య కనీసం ఒక్క అడుగు దూరం ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కాలినడక దారి ఉండడం వలన కలుపు నివారణ, నీరు అందించడానికి, సష్యరక్షణకు అనువుగా ఉంటుంది. విత్తనాలు వేసుకునేముందు విత్తనాల మధ్య సమాన దూరాలు ఉండేలా గుర్తులు లేదా గీతలు గీసుకొని విత్తనాలు విత్తుకోవాలి.

ఒక్క ఎకరానికి 3 నుండి 4 కిలోల విత్తనాల వరకు అవసరమవుతాయి.. ఈ ఉల్లి విత్తనాలను విత్తన శుద్ధి చెయ్యాలి.. అప్పడే తెగుళ్లు రాకుండా ఉంటాయి.. ఈ పంటకు అనువైన నేలలు నల్లరేగడి, ఎర్ర నేలలు, చౌక నేలలు అనువైనవి. పనికిరాని నేలలు చౌడు నేలలు, ఇసుక నేలలు, క్షారత్వం ఎక్కువ ఉన్న నెలల్లో వేస్తె దిగుబడి తక్కువగా ఉంటుంది..

కలుపు నివారణకు చాలా ముఖ్యమైంది..ఈ కలుపు నివారణ కోసం రసాయన మందులు కాకుండా కలుపును సంప్రదాయ పద్దతిలో కూలీల సహాయంతో తొలగించడం మంచిది. నాటువేసిన 40 రోజులలో వరకు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి..

ఈ పంటలో సాధరణంగా తెగులుళ్ళ బెరద వేరే పంటలతో పోలిస్తే తక్కువగానే ఉంటుంది.

పెనుబంక తెగులు సోకినా మొక్క యొక్క రసాన్ని పీల్చడం వల్ల మొక్క యొక్క ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఈ తెగులు ఒక్క మొక్క నుండి మరో మొక్కకి వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు తెగులు సోకినా వెంటనే తీసుకోవాలి లేనిచో పంట ప్రభావం చూపుతుంది..

నివారణ చర్యలు..

డైమెథోయేట్ 30 ఈసి 1 మీ.లీ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి లేదా మిథీ డెమెటన్ 25 ఈసి 1 మీ.లీ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మోనోక్రోట్ఫాస్ 36 ఎస్. ల్ 1.5 మీ.లీ 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.. కొందరు వేప ముందుకు కూడా వేసుకుంటున్నారు..