Site icon NTV Telugu

AP Cabinet: నేడు మంత్రులకు శాఖల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కసరత్తు..!

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 24 మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలను కేటాయిస్తానని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు గురువారం మధ్యాహ్నం అమరావతి చేరుకుని సచివాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఇవాళ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.

Read Also: Italy: ఇటలీ పార్లమెంట్‌లో ఎంపీల ఫైట్..జీ-7కి ముందు ఘటన..

కాగా, మరో వైపు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్దయేత్తున ప్రచారం జరుగుతుంది. అలాగే, నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించే ఛాన్స్ ఉందని అందరు భావిస్తున్నారు. ఇక, మిగతా ముఖ్య శాఖలను సీఎం చంద్రబాబు సీనియర్లకు అప్పగించే అవకాశం ఉంది.

Exit mobile version