నార్డ్ సిరీస్ లో భాగంగా వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయాలనుకుంటోంది. వన్ ప్లస్ ఏస్ 3V త్వరలో నార్డ్ 4 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా ప్రపంచ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ గత నెలలో చైనీస్ మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 12GB ర్యామ్ ఉంది. ఈ ఫోన్ యొక్క ఇతర ఫీచర్లను చూస్తే.. ఇంటర్నెట్‌లో లభించే సమాచారం ఆధారంగా.., ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కలిగి ఉండగా., సింగిల్ కోర్ టెస్ట్‌లో 1875 పాయింట్లు, అలాగే మల్టీ పాయింట్ టెస్ట్ లో 4934 పాయింట్లను సాధించింది.
Also Read: Rashmika Mandanna: వామ్మో.. రష్మిక ఏంటి ఆ టైంలో అంత బరువులను మోసేస్తుంది.. పోస్ట్ వైరల్..
ఫోన్ ప్రాసెసర్ విషయానికొస్తే., వన్ ప్లస్ నార్డ్ 4 ఆక్టా – కోర్ చిప్ సెట్ ను కలిగి ఉంది. క్లాక్ స్పీడ్ 2.80 GHz. ఫోన్ స్నాప్ డ్రాగన్ 7+ Gen 3 SoC ద్వారా ఆధారితమైనది. శక్తివంతమైన ఖ్వల్కామ్ చిప్‌సెట్ ఇందులో ఉంది. ఈ చిప్‌సెట్ ఏస్ 3Vలో చేర్చబడింది. ఇక ఇందులో బ్యాటరీ కోసం 5500 mAh బ్యాటరీని వాడుతున్నారు. 80W వైర్డు ఛార్జింగ్ కు ఇది సపోర్ట్ చేస్తుంది. FV5 డేటాబేస్ ప్రకారం., వన్ ప్లస్ నార్డ్ 4 f/1.9 ఎపర్చర్ తో 50- మెగా పిక్సెల్ OIS కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ఈ లెన్స్ 26.4 మిమీ ఫోకల్ లెంగ్త్ తో లెన్స్ తో అమర్చబడి ఉంటుంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా ఇందులో పొందుపరిచారు.
Also Read: Prasanth Varma: ఆ వీడియో చూసి కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్ వర్మ..
వన్ ప్లస్ నార్డ్ 4 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.9 ఎపర్చరు, 26.4mm ఫోకల్ లెంగ్త్ తో కూడిన ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. అయితే, ఈ రూమర్డ్ స్పెక్స్ వన్ ప్లస్ ఏస్ 3Vని పోలి ఉంటాయి. నార్డ్ 4120 Hz రిఫ్రెష్ రేట్ తో 6.74 అంగుళాల OLED ఫ్లాట్ స్క్రీన్ ను కలిగి ఉంది. స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో ఆధారితంగా పనిచేస్తుంది. కెమెరా సాంకేతికత పరంగా, వన్ ప్లస్ ఏస్ 3V 50MP సోనీ IMX882 సెన్సార్ తో డ్యూయల్ కెమెరా సెటప్, OISతో 8MP సోనీ IMX355 కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ లను కలిగి ఉండనుంది. ఏస్ 3V IP65 రక్షణతో రెండు స్టీరియో స్పీకర్లను కూడా అందిస్తుంది.