Site icon NTV Telugu

OnePlus Pad 3 Launch: అల్ట్రా స్లిమ్ డిజైన్‌, 12140mAh భారీ బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ ప్యాడ్ 3 లాంచ్..!

Oneplus Pad 3

Oneplus Pad 3

OnePlus Pad 3 Launch: వన్‌ప్లస్ కంపెనీ తన తాజా ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ అయిన వన్‌ప్లస్ ప్యాడ్ 3 ను అధికారికంగా లాంచ్ చేసింది. అబ్బుర పరిచే స్పెసిఫికేషన్లు, మెరుగైన ఆడియో అనుభవం, ఇంకా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇది మార్కెట్లోకి వచ్చింది. మరి ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 3 పృథి వివరాలను చూసేద్దామా..

Read Also: Gautam Gambhir: “రోడ్‌షోలు అవసరమా..?” బెంగుళూరు ఘటనపై టీమిండియా కోచ్ రియాక్షన్ ఇదే..!

వన్‌ప్లస్ ప్యాడ్ 3లో 13.2 అంగుళాల 3.4K (3392 x 2400) LCD డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్ కలిగి ఉండగా, 540Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఇంకా 900 నిట్స్ బ్రైట్‌నెస్ తో వస్తోంది. మల్టీ-లెవల్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఈ టాబ్లెట్‌ను మరింత స్మూత్ గా మార్చుతుంది. ఈ ప్యాడ్ లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్, Adreno 830 GPU, 12GB లేదా 16GB LPDDR5X/T RAM, 256GB లేదా 512GB UFS 4.0 స్టోరేజ్ తో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్OS 15 పై పనిచేస్తుంది.

వన్‌ప్లస్ ప్యాడ్ 3లో మొత్తంగా ఎనిమిది (4 మిడ్-బాస్ + 4 ట్వీటర్ యూనిట్స్) స్పీకర్లు ఉన్నాయి. ఇవి ఓమ్నీ బేరింగ్ సౌండ్ ఫీల్డ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తాయి. స్క్రీన్ దిశను గుర్తించి ఆటోమేటిక్‌గా ఆడియో ఛానెల్స్ మార్చే సామర్థ్యం దీనికి ఉంది. ఇక ఈ టాబ్లెట్‌కు 13MP రేర్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది కేవలం 5.97 మిమీ మందంతో కూడిన మెటల్ యునిబాడీ డిజైన్ లో వస్తోంది. ఇక ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది 12,140mAh భారీ బ్యాటరీతో, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 92 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. వీటితో ఈ వన్‌ప్లస్ ప్యాడ్ 3 మరికొన్ని ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

Read Also: Deepika Padukone : దీపిక నాతో రెండేళ్లు డేటింగ్ చేసింది.. నటుడి షాకింగ్ కామెంట్స్..

కీబోర్డు: పెద్ద కీ కాప్స్, కమాండ్ కీస్, AI బటన్, మాగ్నెటిక్ కనెక్షన్.

స్టైలస్ సపోర్ట్: OnePlus Stylo 2 తో పనిచేస్తుంది.

ఫోలియో కేసు కూడా అందుబాటులో ఉంది.

కనెక్టివిటీ, అదనపు ఫీచర్లు: Wi-Fi 7, Bluetooth 5.4, USB 3.2 Gen1

NFC, Type-C ఆడియో, 5G డేటా షేరింగ్

OnePlus ఫోన్లతో డేటా షేరింగ్, నోటిఫికేషన్, ఫైల్ ట్రాన్స్ఫర్ మద్దతు.

ఇక ధరల విషయానికి వస్తే.. 12GB+256GB మోడల్ 699.99 డాలర్స్ (రూ. 60,070 సుమారు) కాగా., 16GB+512GB మోడల్ 799 డాలర్స్ (రూ. 68,570 సుమారు), కీబోర్డు 199.99 డాలర్స్ (రూ. 17,160 సుమారు), స్టైలో 2 99.99 డాలర్స్ (రూ. 8,580 సుమారు), ఫోలియో కేస్ 49.99 డాలర్స్ (రూ. 4,290 సుమారు) గా నిర్ణయించారు. ఈ టాబ్లెట్ జూన్ 19 నుండి యూరోప్‌ లో అందుబాటులోకి రానుంది. జూలై 8 నుండి నార్త్ అమెరికాలో లభించనుంది. భారతదేశంలో కూడా అతి త్వరలోనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వన్‌ప్లస్ వేదికగా విక్రయానికి రానుంది.

Exit mobile version