OnePlus Open Launch: వనప్లస్ ఓపెన్ వచ్చేసింది.. ధర, ఫీచర్స్ ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Open Foldable SmartPhoneLaunch and Price in India: ‘వన్‌ప్లస్’ తమ తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేసింది. వనప్లస్ ఓపెన్ భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ ఫోన్ ధర భారత్‌లో రూ. 1,39,999గా ఉంది. వనప్లస్ ఓపెన్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తోంది. ఫోన్ లోపలి భాగంలో 7.82 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. ఇందులో 4,800 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంది. వనప్లస్ ఓపెన్ ఫోన్ ఫీచర్లను ఓసారి చూద్దాం.
OnePlus Open Price:
వన్‌ప్లస్ ఓపెన్ ఫోన్ 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర భారత్‌లో రూ.1,39,999గా ఉంది. ఎమరాల్డ్ డెస్క్, వాయేజర్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 27 నుంచి విక్రయానికి వస్తాయి. రూ. 8,000 వరకు ఎక్స్‌ఛేంజ్‌రాయితీ.. ఐసీఐసీఐ కార్డు, వన్‌కార్డ్ ద్వారా రూ.5,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
OnePlus Open Display:
వన్‌ప్లస్ ఓపెన్‌లో డ్యుయల్ సిమ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ఓస్ 13.2తో ఇది వస్తోంది. లోపలి భాగంలో 7.82 అంగుళాల (2,268×2,440 pixels) 2కే ఫ్లెక్సీ- ఫ్లుయిడ్ ఎల్‌టీపీఓ 3.0 అమోలెడ్ స్క్రీన్ ఉండగా.. ఇది 1-120Hz డైనమిక్ రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ రెస్పాన్స్ రేట్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పనిచేస్తుంది. వెలుపలి భాగంలో 6.31 అంగుళాల (1,116×2,484 pixels) 2కే ఎల్‌టీపీఓ 3.0 సూపర్ ఫ్లుయిడ్ అమోలెడ్ స్క్రీన్ ఉంటుంది. ఇది 10-120Hz డైనమిక్ రీఫ్రెష్ రేట్, 240Hz టచ్ రెస్పాన్స్ రేట్, 2,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ ఉంది.
Also Read: Asian Games 2023: ఏషియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులకు నగదు బహుమలు..ఎవరికెంతంటే?
OnePlus Open Camera:
వన్‌ప్లస్ ఓపెన్ వెనుకభాగంలో మూడు కెమెరాలతో కూడిన సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 1/1.43 అంగుళాల సోనీ LYT-T808 సీఎంఓఎస్ సెన్సార్, f/1.7 ఎపర్చర్ ఉంది. 64 మెగా పిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉంది. సెల్ఫీల కోసం లోపలి స్క్రీన్‌పై 20 మెగాపిక్సెల్, బయటి స్క్రీన్‌పై 32 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
OnePlus Open Battery:
వన్‌ప్లస్ ఓపెన్‌లో 4,800 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో 5G, 4G LTE, వైఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ, గెలీలియో, క్యూజెడ్‌ఎస్‌ఎస్, యూఎస్‌బీ 3.1 ఫీచర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!