NTV Telugu Site icon

OnePlus Nord CE4 Lite 5G Price: ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌’ టాప్-10 ఫీచర్స్ ఇవే!

Oneplus Nord Ce4 Lite 5g

Oneplus Nord Ce4 Lite 5g

OnePlus Nord CE4 Lite 5G Smartphone Price in India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’ నార్డ్‌ సిరీస్‌లో ‘సీఈ 4 లైట్‌’ ఫోన్‌ను జూన్ 25న విడుదల చేసింది. గతేడాది తీసుకొచ్చిన నార్డ్‌ సీఈ3 లైట్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను రిలీజ్ చేసింది. జూన్‌ 27 నుంచి వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌లో సీఈ 4 లైట్‌ ఫోన్‌కు అందుబాటులోకి రానున్నాయి. 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ వంటి మెరుగైన ఫీచర్స్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.20 వేల్లోపే ఉండడం విశేషం. తక్కువ బడ్జెట్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.19,999గా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. మెగా బ్లూ, సూపర్‌ సిల్వర్‌, అల్ట్రా ఆరెంజ్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మెగా బ్లూ, సూపర్‌ సిల్వర్‌ ఫోన్లు జూన్‌ 27 నుంచి అందుబాటులో ఉంటాయి. అల్ట్రా ఆరెంజ్‌ ఫోన్‌ సేల్‌ తేదీని వన్‌ప్లస్‌ కంపెనీ త్వరలో ప్రకటించనుంది. నార్డ్‌ సీఈ 4 లైట్‌ టాప్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ ఫీచర్స్:
# 6.67 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లే
# 120Hz రిఫ్రెష్‌ రేటు, 2100 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
# స్నాప్‌డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌
# ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 14
# 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ బ్యాక్ కెమెరా
# ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ సపోర్ట్‌తో కూడిన 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా
# 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ
# 80W సూపర్‌ వూక్‌ పాస్ట్‌ ఛార్జింగ్‌
# ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌
# 3.5 ఎంఎం ఆడియో జాక్‌

Show comments