OnePlus Nord 4 Price: ‘వన్‌ప్లస్ నార్డ్ 4’ వచ్చేసింది.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్!
- నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్
- 5500 ఎంఏహెచ్ బ్యాటరీ
- 50 ఎంపీ సోనీ సెన్సర్
- 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OnePlus Nord 4 Launch Date and Price in India: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్’.. నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘వన్‌ప్లస్ నార్డ్ 4’ను మంగళవారం రిలీజ్ చేసింది. గతేడాది వచ్చిన వన్‌ప్లస్ నార్డ్ 3కి కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తోంది. వన్‌ప్లస్ సమ్మర్ లాంచ్ ఈవెంట్లో ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ వన్‌ప్లస్ నార్డ్ 4లో 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. 50 ఎంపీ సోనీ సెన్సర్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.
వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.29,999గా ఉండగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.32,999గా ఉంది. ఇక హై ఎండ్ వేరియంట్ 12జీబీ+256 జీబీ ధర రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. సిల్వర్, గ్రీన్, మిడ్నైట్ షేడ్స్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2 నుంచి విక్రయాలు ఆరంభం అవుతాయి. జులై 20 నుంచి 30 మధ్య వన్‌ప్లస్, అమెజాన్‌లో ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో కలిపి బేస్ వేరియంట్ రూ.27,999కి మీకు లభిస్తుంది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచెస్ డిస్ప్లే ఇచ్చారు. 1.5K అమోలెడ్, 120 Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 7+ జనరేషన్ 3 ప్రాసెసర్ ఉండగా.. ఆండ్రాయిడ్ 14తో కూడిన ఆక్సిజన్ ఓఎస్ 14.1తో వస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన సోనీ LYTIA సెన్సర్‌ను ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 4K వీడియోను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 100W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 1 నుంచి 100 శాతం ఛార్జింగ్ కేవలం 28 నిమిషాల్లోనే అవుతుంది.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్‌రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!