NTV Telugu Site icon

OnePlus Buds Pro 3: సరికొత్త ఫీచర్లతో ఊహించని అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమైన వన్‌ప్లస్

Oneplus

Oneplus

OnePlus Buds Pro 3: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ 2025, జనవరి 7న ఇండియాలో జరిగిన వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13R ఫోన్ల రిలీజ్ ఈవెంట్‌లో తమ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3ను కూడా గ్రాండ్‌గా లాంచ్ చేసింది. వీటిని డానిష్ ఆడియో దిగ్గజం డైనాడియో సహకారంతో రూపొందించారు. ఇందులో 50dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉండటం దీని ప్రత్యేకత. దీని స్పేషియల్ ఆడియో సపోర్ట్‌తో థియేటర్‌లో ఉన్న అనుభూతిని మనకి అందిస్తుంది. ఇక విడుదలైన ఒక్కొక్క ఇయర్‌బడ్‌లో 11mm డ్రైవర్, 6mm ట్వీటర్ కలిపిన డ్యూయల్-డ్రైవర్ సెటప్ ఉంది. రెండు డిజిటల్-టు-అనలాగ్ కన్వర్టర్లు (DACs) ద్వారా సౌండ్ మరింత స్పష్టంగా ఉంటుంది.

Also Read: Kangana Ranaut: ప్రియాంకా గాంధీ ‘‘ఎమర్జెన్సీ’’ సినిమా చూడాలి.. కంగనా ఆహ్వానం..

వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3లో అధునాతన ‘స్టెడీ కనెక్ట్’ టెక్నాలజీ ఉంది. దీని ద్వారా 360 మీటర్ల దూరంలో కూడా బ్లూటూత్ సిగ్నల్ పర్ఫెక్ట్‌గా అందుతుంది. బ్లూటూత్ 5.4 సపోర్ట్‌తో పాటు, గూగుల్ ఫాస్ట్ పెయిర్ ఆప్షన్ ఉంది. అంతేకాకుండా, AI ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను అందించడంలో వన్‌ప్లస్ ఓ ముందడుగు వేసింది. వన్‌ప్లస్ 13 సిరీస్‌తో చక్కగా పనిచేసే ఈ ఫీచర్‌ ద్వారా వేర్వేరు భాషల్లో మాట్లాడుతున్నా కన్వర్జేషన్లు చాలా సులువుగా సాగుతాయి. ఇక వీటిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 ఏకంగా 43 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. వీటిని కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే ఏకంగా 5 గంటల పాటు వినియోగించుకోవచ్చు.

Also Read: Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

ఇక ఆడియో వాల్యూమ్ ను పెంచడానికి లేదా తగ్గించడానికి ఇయర్‌ బడ్‌ పై స్వైప్ చేసుకోవచ్చు. అలాగే మ్యూజిక్ ను ప్లే చేయడానికి లేదా స్టాప్ చేయడానికి పిన్చ్ చేస్తే సరిపోతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌కు వెళ్ళడానికి మనం పిన్చ్ చేసి కాస్త హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న మిడ్‌నైట్ ఓపస్, లూనార్ రేడియన్స్ రంగులకు తోడుగా, కొత్త సఫైర్ బ్లూ కలర్ వేరియంట్ వినియోగదారులను ఆకట్టుకునెలా ఉంది. ఇది వన్‌ప్లస్ 13 సిగ్నేచర్ బ్లూ కలర్‌ మొబైల్ కు పర్ఫెక్ట్ మ్యాచ్‌ అవుతుంది. ఇక ఈ వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 సఫైర్ వేరియంట్ ధర విషయైనికి వస్తే.. కంపెనీ రూ.11,999గా నిర్ణయించింది. జనవరి 10వ తేదీ నుంచి ఇవి వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, అలాగే రిటైల్ స్టోర్స్‌లో లభించనున్నాయి. IP55 వాటర్ రెసిస్టెన్స్ తోపాటు అదిరిపోయే సౌండ్ క్వాలిటీ ఈ ఇయర్‌ బడ్స్‌ ప్రత్యేకతలు.

Show comments