Site icon NTV Telugu

ట్రిపుల్ 50MP కెమెరా, 7300mAh బ్యాటరీ, శక్తివంతమైన చిప్‌సెట్.. నవంబర్ 13న OnePlus 15 లాంచ్!

Oneplus 15 India

Oneplus 15 India

OnePlus 15 Launch, Price and Specs in India: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’.. తన తదుపరి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ ‘వన్‌ప్లస్‌ 15’ను చైనాలో ఇప్పటికే లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ 13కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ 15 వచ్చింది. మధ్యలో వన్‌ప్లస్‌ 14ను కంపెనీ స్కిప్‌ చేసింది. చైనాలో లాంచ్ అయిన 15.. ఇప్పుడు భారతదేశంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 13న రాత్రి 7 గంటలకు మన దగ్గర రిలీజ్ కానుంది. అదే రోజు రాత్రి రాత్రి 8 గంటలకు ఈ హ్యాండ్‌సెట్ అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్, శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఆ డీటెయిల్స్ చూద్దాం.

వన్‌ప్లస్‌ అధికారిక పోర్టల్‌లో 15 ఫోన్‌ ఫీచర్లు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్‌ 15 ఫోన్ 6.78 అంగుళాల ఎల్‌టీపీఓ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్‌రేటుకు సపోర్ట్‌ చేస్తుంది. IP68 రేటింగ్‌, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఉన్నాయి. ఔటాఫ్‌ ది బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 16తో ఇది పనిచేస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌ను ఇందులో అమర్చారు. ఈ చిప్‌సెట్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మొబైల్ CPU అని చెప్పొచ్చు.

వన్‌ప్లస్‌ 15లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 ఎంపీ సోనీ IMX906 OIS మెయిన్ కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్స్, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్‌ ఉన్నాయి. సెల్ఫీ కోసం 32 ఎంపీ సోనీ IMX709 సెన్సర్‌ ఉంటుంది. వన్‌ప్లస్‌ 15 ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జర్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్‌తో వస్తుంది.

8.31 ఎంఎం మందంతో వస్తున్న వన్‌ప్లస్‌ 15 ఫోన్‌ బరువు 215 గ్రాములు. 12GB, 16GB LPDDR5x అల్ట్రా RAM ఎంపికలతో వస్తుంది. 1TB వరకు UFS 4.1 నిల్వ ఉంటుంది. వన్‌ప్లస్‌ 15 ధర రూ.70-75 వేలుగా ఉండొచ్చు. భారతదేశంలో స్పెసిఫికేషన్ల పరంగా ఏమైనా మార్పులు చేస్తారా?, ఇవే స్పెక్స్‌తో వస్తుందా అనేది తెలియాలంటే మూడు రోజులు వేచి చూడాల్సిందే.

Exit mobile version