NTV Telugu Site icon

OnePlus 13 Launch: ‘వన్‌ప్లస్‌ 13’ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేశాయి.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

Oneplus 13 Launch

Oneplus 13 Launch

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ‘వన్‌ప్లస్‌’ వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలో వన్‌ప్లస్‌ 13 సిరీస్‌ను రిలీజ్ చేసింది. మంగళవారం నిర్వహించిన వింటర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో 13 సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 13, వన్‌ప్లస్‌ 13ఆర్‌ ఫోన్‌లను లాంచ్‌ చేసింది. 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 మెయిన్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫ్లాగ్‌షిప్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లకు నాలుగేళ్ల ఓఎస్‌ అప్‌డేట్లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. 13 సిరీస్‌ ఫోన్‌ల ధర, స్పెసిఫికేషన్ల డీటెయిల్స్ చూద్దాం.

OnePlus 13 Price and Specs:
వన్‌ప్లస్‌ 13 ఫోన్ 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.69,999గా ఉండగా.. 16జీబీ+512జీబీ ధర రూ.76,999గా ఉంది. ఇక టాప్ వేరియంట్‌ 24జీబీ+1టీబీ ధరను రూ.89,999గా కంపెనీ నిర్ణయించింది. జనవరి 10 నుంచి ఈ ఫోన్లు అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయి. మిడ్‌నైట్‌ ఓషన్‌, ఆర్కిటిక్‌ డాన్‌, బ్లాక్‌ ఎక్లిప్స్‌ రంగుల్లో ఇది లభ్యం కానున్నాయి. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఐసీఐసీఐ కార్డుపై రూ.5 వేల తగ్గింపు ఆఫర్‌ ఉంది. రూ.7వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లు కూడా ఉన్నాయి.

వన్‌ప్లస్‌ 13 ఫోన్ 6.82 ఇంచెస్ 2కే ఓఎల్‌ఈడీ, 120Hz రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లేతో వచ్చింది. 4500 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ చిప్‌, ఏఐ పవర్డ్‌ ఆక్సిజన్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉంది. ఐపీ69/ఐపీ68 రేటింగ్‌, ఆక్వా టచ్‌ 2.0తో దీనిని తీసుకొచ్చారు. వెనుకవైపు 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 808 మెయిన్‌, 50 ఎంపీ అల్ట్రావైడ్‌, 50 ఎంపీ ట్రైప్రిజమ్‌ టెలిఫొటో కెమెరాలు ఉండగా.. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ముందుభాగంలో ఉంది. ఇందులో 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 100 వాట్‌ సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Also Read: AFI President: ఏఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బహదూర్‌సింగ్‌!

OnePlus 13R Price and Specs:
వన్‌ప్లస్ 13 ఆర్‌ 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.42,999గా.. 16జీబీ+512జీబీ ధర రూ.49,999గా ఉంది. జనవరి 13 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఆస్ట్రల్‌ ట్రయల్‌, నెబ్యులా నొయిర్‌ రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. ఐసీఐసీఐ కార్డుపై రూ.3 వేల తగ్గింపు ఉండగా.. రూ.4వేల వరకు అదనపు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌ ఉంది. వన్‌ప్లస్ 13 ఆర్‌లో 6.78 ఇంచెస్ 1.5కే ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్‌ రేట్‌, ఏఐ పవర్డ్‌ ఆక్సిజన్‌ 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, స్నాప్‌డ్రాగన్‌ 8జెన్‌ 3 ప్రాసెసర్‌, ఐపీ65 రేటింగ్‌, ఆక్వా టచ్‌ 2.0 ఉన్నాయి. ఇందులో 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 700 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 50 ఎంపీ టెలిఫొటో కెమెరాలు వెనకభాగంలో.. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ముందుభాగంలో ఉన్నాయి. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ 80 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Show comments