NTV Telugu Site icon

OnePlus 12 Price Drop: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్.. వన్‌ప్లస్‌ 12పై భారీ తగ్గింపు!

Oneplus 12 Price Drop

Oneplus 12 Price Drop

OnePlus 12 Price Cut in Amazon Great Summer Sale 2024: ప్రస్తుతం అమెజాన్‌లో ‘గ్రేట్ సమ్మర్ సేల్’ 2024 నడుస్తోంది. మే 2న ఆరంభం అయిన ఈ సేల్ మే 7 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు చాలా చౌక ధరలకు అందుబాటులో ఉంటాయి. ఐఫోన్, వన్‌ప్లస్‌, షావోమికి చెందిన పలు స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు ఉంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ధర మరింత తగ్గవచ్చు కూడా. వన్‌ప్లస్‌ 12పై భారీ తగ్గింపు ఉంది.

వన్‌ప్లస్‌ యొక్క కొత్త టాప్ మోడల్ ఫోన్ ‘వన్‌ప్లస్‌ 12’. అమెజాన్‌ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఈ ఫోన్ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ (12జీబీ ర్యామ్‌ + 512 జీబీ స్టోరేజ్) అసలు ధర రూ. 64,999. మీరు అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే.. మీరు రూ. 3,249 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత వన్‌ప్లస్‌ 12 ధర రూ.61,750గా అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు మరిన్ని ఆఫర్లు ఉన్నాయి.

Also Read: Hardik Pandya: చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సమయం పడుతుంది: హార్దిక్ పాండ్యా

వన్‌ప్లస్ 12 ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత కలర్‌ఓఎస్‌ 14తో వచ్చింది. 4,500 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 120Hz వరకు రీఫ్రెష్‌ రేట్‌తో కూడిన 6.82 అంగుళాల క్వాడ్‌ హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీఓ ఓలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌ ఉంటుంది. వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్‌ కెమెరా ఈ ఫోన్లో ఉంటుంది. 100వాట్‌ సూపర్ ఊక్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5,400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.

Show comments