OnePlus 12 5G Smartphone Release Date in India: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ ‘వన్‌ప్లస్’.. భారత మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. వన్‌ప్లస్‌కి భారత మార్కెట్‌లో ‘యాపిల్ ఐఫోన్’ రేంజ్ సేల్స్ ఉండడంతో వరుస స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తుంది. మొన్నటివరకు మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసిన వన్‌ప్లస్.. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో వన్‌ప్లస్ 11 5G ఫోన్‌కు సక్సెసర్‌గా వన్‌ప్లస్ 12ను తీసుకొస్తుంది. వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ డేట్‌ను కంపెనీ సీఈఓ వెల్లడించారు.
OnePlus 12 Launch:
కంపెనీ పదేళ్ల వార్షికోత్సవం సందర్భంగా వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 4న చైనాలో రిలీజ్ చేయనుంది. ఈ లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 4న సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే వన్‌ప్లస్ 12 ఫోన్ 2024 జనవరిలో భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. వన్‌ప్లస్‌కు భారతదేశం కీలకమైన మార్కెట్‌లలో ఒకటిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 12 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ‘వన్‌ప్లస్ వాచ్ 2’ మోడల్‌ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
OnePlus 12 Specs:
వన్‌ప్లస్ 11 భారతదేశంలో ఫిబ్రవరి 2023లో రిలీజ్ అయింది. వన్‌ప్లస్ 10 ప్రో, వన్‌ప్లస్ 9 సిరీస్‌లు గతంలో మార్చి నెలలో ప్రారంభించబడ్డాయి. అయితే ఈసారి వన్‌ప్లస్ 12 గ్లోబల్ లాంచ్ 2024 జనవరిలోనే ఉండొచ్చని తెలుస్తోంది. వన్‌ప్లస్ 12 లాంచ్‌కు ముందు కంపెనీ కొన్ని స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది QHD+ (1,440 x 3,168) అమోలెడ్ డిస్‌ప్లేతో రానుంది. ఈ స్క్రీన్ 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
OnePlus 12 Camera:
వన్‌ప్లస్ 12లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఓఐఎస్ సపోర్టెడ్ 50-మెగాపిక్సెల్ సోనీ LYT-808 సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సోనీ IMX581 సెన్సార్, ఓఐఎస్ 64-మెగాపిక్సెల్ 3x టెలిఫోటో జూమ్ లెన్స్ ఉంటాయి. ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా వవ ఫోన్ కలిగి ఉంటుంది.
OnePlus 12 Battery:
వన్‌ప్లస్ 12 ఫోన్ 50W వైర్‌లెస్, 100W వైర్డు ఫాస్ట్ చార్జింట్ టెక్‌కు మద్దతుతో 5,400mAh బ్యాటరీ వస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ ధరను ఇంకా వెల్లడించలేదు. వన్‌ప్లస్ 11 5G ఫోన్‌ను రూ. 62 వేలకు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వన్‌ప్లస్ 12 మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.