NTV Telugu Site icon

OnePlus 10 Pro 5G Price: అమెజాన్‌‌లో బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 17 వేల తగ్గింపు!

Oneplus 10 Pro 5g

Oneplus 10 Pro 5g

Buy OnePlus 10 Pro 5G Smartphone Rs 54999 in Amazon Great Freedom Festival Sale 2023: మీరు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనాలని చూస్తున్నారా?. అయితే మీకు పండగ లాంటి వార్త. ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’లో బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. అమెజాన్‌‌ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా తక్కువ ధరకే 5జీ ఫోన్ కొనొచ్చు. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్‌ను రూ. 17 వేల తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఓసారి చూద్దాం.

వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 66,999గా ఉంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 18 శాతం తగ్గింపు ఉంది. దాంతో ఈ ఫోన్‌ రూ. 54,999కు అందుబాటులో ఉంటుంది. అంటే మీరు రూ. 12,000 డిస్కౌంట్ పొందుతారు. అలాగే ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే మీకు దాదాపుగా రూ. 5 వేల తగ్గింపు వస్తుంది. అప్పుడు మీరు రూ. 49,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 52,100 వరకు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ పొందవచ్చు. పూర్తి ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తిస్తే.. మీరు కేవలం రూ. 2899కే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్ బాగుంది, లేటెస్ట్ మోడల్ అయుండి, ఎలాంటి డామేజ్ లేకుంటేనే ఈ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వర్తిస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. అందుకే మీ పాత ఫోన్‌కు ఎంత ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ వస్తుందని ముందే చెక్ చేసుకుంటే మేలు. ఇక వన్‌ప్లస్ 10 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Also Read: Amazon TV Offers: అమెజాన్‌‌లో బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఆఫర్.. 83 వేల స్మార్ట్‌టీవీ కేవలం 22 వేలకే! ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కాకుండానే