Site icon NTV Telugu

Delhi Fire: ఐటీ ఆఫీస్‌లో మంటలు.. ఒకరి మృతి.. పలువురికి గాయాలు

Fie

Fie

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. సంఘటనాస్థలికి చేరుకుని పలువురిని రక్షించారు. దాదాపు 21 ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Flights theft: 200 ఫ్లైట్‌లు ఎక్కాడు.. లక్షల్లో దోచేశాడు.. ఘరానా దొంగ ఎలా దొరికాడంటే..!

ప్రస్తుతానికి ఒకరు చనిపోగా.. ఏడుగురిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. సెంట్రల్ రెవెన్యూ భవనంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 46 ఏళ్ల వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించాడని.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని చెప్పారు. కానీ అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో హల్‌హల్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Paytm : కొత్త వ్యాపారంలోకి పేటీఎం .. త్వరలోనే ఆ సర్వీస్ ప్రారంభం..

Exit mobile version