NTV Telugu Site icon

CM YS Jagan: మరోసారి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్.. నేడు సీఎం జగన్‌ కీలక సమావేశం

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కీలకమైన సమయాల్లో తన యాత్రకు బ్రేక్‌ ఇస్తూ ఇస్తున్నారు.. ఇక, ఇవాళ “మేమంతా సిద్ధం” బస్సు యాత్ర కు బ్రేక్ పడింది.. ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు జగన్‌.. సీనియర్ నేతలతో అంతర్గత సమావేశం కానున్నారట.. మరోవైపు.. ఈనెల 26వ తేదీన వైసీపీ మ్యానిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.. ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదల కావడంతో.. ఓవైపు ప్రచారం విస్తృతం చేస్తూనే.. ఇంకో వైపు.. ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు..

Read Also: Virat Kohli-Umpires: సహనం కోల్పోయి.. అంపైర్‌లపై నోరుపారేసుకున్న విరాట్ కోహ్లీ (వీడియో)!

ఇక, గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల యుద్ధంలో విజయం సాధించిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సారి మేనెఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారని తెలుస్తోంది.. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై మేనిఫెస్టోలో పొందుపరుస్తుందట వైసీపీ.. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు.. రేపు సోషల్ మీడియా వింగ్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు.. సోషల్ మీడియా సమావేశం అనంతరం బస్సు యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.. రేపు విజయనగరం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుండగా.. రోడ్‌షో, బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ పథకాలు ప్రకటించి.. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండగా.. సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ జగన్‌ సీఎం అయితేనే సాధ్యం అవుతుందంటున్న వైసీపీ.. ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేసామని చెబుతున్న వైసీపీ నేతలు.. ఈ సారి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ధీటుగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.