NTV Telugu Site icon

Deputy CM Pawan: బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు బిజీబిజీగా డిప్యూటీ సీఎం పవన్

Pawan

Pawan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపట్టిన తొలి రోజే కొణిదెల పవన్ కళ్యాణ్ శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భగా బాధ్యతలు స్వీకరించిన రోజంతా బిజీబిజీగా గడిపారు. ఇవాళ వరుస సమీక్షలు నిర్వహించారు. నేటి ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖల HODలతో సమీక్ష సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం.. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. శాఖల్లో అంశాల వారీగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

Read Also: PM Modi Security Breach: ప్రధాని మోడీ కారుపై చెప్పు విసిరారు.. వీడియో వైరల్..

ఇక, ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితులపై అధికారుల నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకుని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోట్ చేసుకున్నారు. అలాగే, ఆయా శాఖల్లో కార్యాచరణపై మరోమారు త్వరలోనే సమీక్ష సమావేశాలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుందామని అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో రేపు సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

Read Also: Star Hospital: స్టార్ ట్రామా అండ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ నెట్‌వర్క్తో 15 నిమిషాల్లో అంబులెన్స్ సేవలు..

అలాగే, మరోవైపు పవన్ అన్నయ్య జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మాట్లాడుతూ.. పవన్ను డిప్యటీ సీఎంగా చూడటం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు. సామర్థ్యం, అవగాహన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్.. సొసైటీలో చాలా విషయాల్లో రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక, పవన్ కి తగిన పదవులు, శాఖలు వచ్చాయి.. సమర్ధత కలిగిన నాయకుడు కాబట్టే ఈ పదవి దక్కింది.. ఇవన్నీ చూస్తుంటే మంచి రోజులు వస్తున్నట్టు కనపడుతున్నాయని నాగబాబు పేర్కొన్నారు.