Site icon NTV Telugu

Shubhanshu Shukla: మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా

Shubhanshu Shukla

Shubhanshu Shukla

Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకు ఎక్కబోతున్నాడు. ఈయన స్పేస్‌ఎక్స్‌ (SpaceX) సంస్థ అభివృద్ధి చేసిన డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌కు పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన అనుమతి కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) నుండి ఇటీవల లభించింది. తాజాగా అంతరిక్ష కేంద్రానికి శుక్లా మే 29న వెళ్లనున్నట్లు అధికారికంగా యాక్సియమ్‌ (Axiom) తెలిపింది. యాక్సియమ్‌-4 మిషన్‌లో భాగంగా ఆయన మే 29న ఐఎస్‌ఎస్‌కు వెళ్లనున్నారు.

ఇక యాక్సియమ్‌–4 మిషన్‌లో భాగంగా మొత్తంగా నలుగురు ప్రైవేట్‌ వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. ఇక మే 29న వెళ్లిన వారు 14 రోజుల తర్వాత భూమిపైకి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) సైతం పాలుపంచుకోనుంది. ఈ డ్రాగన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్ట్ కు నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్‌ సారథ్యం వహిస్తుండగా.. హంగేరీకి చెందిన టిబోర్‌ కపూ, పోలాండ్‌కు చెందిన ఉజ్‌నాన్‌స్కీ సైతం ఈ ప్రాజెక్ట్ లో పాల్గొననున్నారు. మొత్తంగా మే 29న నలుగురు వ్యోమగాములు డ్రాగన్‌ అంతరిక్ష నౌకలో ఐఎస్‌ఎస్‌కు చేరుకోనున్నారు. ఇక భారత దేశానికి చెందిన శుభాంశు శుక్లా ప్రస్తుతం భారత వైమానిక దళంలో గ్రూప్‌ కెప్టెన్‌గా సేవలందిస్తున్నారు.

Exit mobile version