Site icon NTV Telugu

Big Breaking: ఉమెన్స్ డే కానుక.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

Pm Modi

Pm Modi

Gas Cylinder Price: దేశ ప్రజలకు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ పేర్కొన్నారు.

Read Also: Lok Sabha Election 2024 : నేడే కాంగ్రెస్ తొలి జాబితా.. రాహుల్, శశిథరూర్ లతో కలిపి 40 మంది అభ్యర్థుల పేర్లు

“ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్ధారించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను అందించడానికి మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది, ”అని ప్రధాన మంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో రాశారు.

 

Exit mobile version