మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఓ సినీ గేయ రచయిత ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి చలించి రాసిన పాట. అందుకు తగినట్టుగానే నేటి పరిణామాలు ఉంటున్నాయి. రోజు రోజుకు మనుషుల్లో మానవత్వం కరువైపోతుంది. ఏ జంతువో.. పక్షో చచ్చిపోతే వెంటనే గుమిగూడిపోతాయి. అంతా ఐక్యమత్యంగా ఉంటాయి. కానీ మనుషుల్లో మాత్రం అలాంటి గుణం కరవడింది. ఇందుకు అహ్మదాబాద్‌లో తాజాగా జరిగిన సంఘటనే ఉదాహరణ.
అహ్మదాబాద్‌లో ఓ వ్యక్తి స్కూటీపై వెళ్తుండగా హఠాత్తుగా బస్సు వచ్చి ఢీకొట్టింది. అంతేకాకుండా అతడిపై బస్సు టైర్లు ఎక్కించి వేగంగా వెళ్లిపోయాడు. సంఘటనాస్థలంలోనే 52 ఏళ్ల పటేల్ అనే వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ఓ బస్సు డ్రైవర్ దారుణంగా ప్రవర్తించి.. కనీసం బస్సు ఆపకుండా వెళ్లిపోతే.. సాటి బాటసారులు.. బైకర్లు మాత్రం కనీసం పట్టించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లిపోవడం మరింత దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ప్రమాదం జరిగిన కొంత సేపటికి జనాలు గుమిగూడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో చిక్కాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అహ్మదాబాద్‌లో ఒక మోటార్‌సైకిల్‌దారుడు వేగంగా దూసుకొచ్చిన బస్సు ఢీకొని మృతి చెందాడు. ఏప్రిల్ 19న జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. దీనికి సంబంధించిన ఫుటేజీ ఇప్పుడు తాజాగా బయటికి వచ్చింది.
నవీన్ పటేల్ అనే 52 ఏళ్ల వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై భూలాభాయ్ క్రాస్‌రోడ్‌ను దాటడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ బస్సు అతనిపైకి దూసుకెళ్లింది. అతడు నేలమీద పడిపోయాడు. అనంతరం బస్సు కుడి వెనుక టైర్ అతని తలపై నుండి వెళ్లిపోయింది. బస్సు డ్రైవర్ మాత్రం ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. నవీన్ పటేల్ రోడ్డుపై పడి ఉంటే అతనికి సహాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం మరింత దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. మనుషులకు మానవత్వం లేదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మీరు కూడా చూసేయండి.
Tragic accident in Ahmedabad captured on CCTV.
The authorities and citizens should take road safety seriously.
But we have plenty of human lives, so no one cares if some of them die like thispic.twitter.com/fV11UBIy5u
— Roads of Mumbai (@RoadsOfMumbai) April 23, 2024