Site icon NTV Telugu

US: బస్సులో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్

Wwww

Wwww

ఇండియాలో ఆయా రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టాక.. సీట్ల కోసం మహిళలు ఎలా కొట్టుకున్నారో అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇలాంటి ఘటనే అగ్రరాజ్యంలో చోటుచేసుకుంది. కాకపోతే అక్కడ డ్రైవర్, ప్యాసింజర్ కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..

అమెరికాలో లాస్ ఏంజిల్స్ సిటీ బస్సు డ్రైవర్‌.. ప్రయాణికురాలి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఛార్జీల విషయంలో వివాదం నెలకొంది. దీంతో ప్రయాణికురాలి.. డ్రైవర్‌ను సీటు లోంచి లాగి కొట్టడం ప్రారంభించింది. దీంతో డ్రైవర్ కూడా ఆమెపై దాడికి తెగబడింది. ఇలా డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌ను తలపించింది. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటలకు సెంట్రల్ అవెన్యూ మరియు జెఫెర్సన్ బౌలేవార్డ్ ప్రాంతంలో జరిగింది.

ఇది కూడా చదవండి: Wine Shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..

వాస్తవానికి యూఎస్‌లో డాష్ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణమే. ఛార్జీలు తీసుకోవల్సిన అవసరమే లేదు. అయినా కూడా మహిళా ప్రయాణికురాలు ఆందోళనకు గురైంది. డ్రైవర్ సీటులోంచి లాగి మరీ కొట్టింది. డ్రైవర్‌కు గాయాలు కావడం ప్రాథమిక చికిత్స తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ప్రయాణికురాలి దాడిని డ్రైవర్ తీవ్రంగా ప్రతిఘటించింది. నా నుంచి వెళ్లిపోమని డ్రైవర్ గట్టిగా అరిచిన అరుపులు వినిపించాయి. కొన్ని నిమిషాల తర్వాత డ్రైవర్ తలుపు మూసుకుని వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. ఆమె సంఘటనా స్థలంలో చికిత్స పొందింది.. ఆసుపత్రిలో చేరకుండా వెళ్లిపోయింది.

 

Exit mobile version