Site icon NTV Telugu

OTT Movies: శుక్రవారం స్పెషల్.. ఇవాళ ఒక్కరోజే ఓటీటీలోకి 11 సినిమాలు..

Ott

Ott

OTT Movies: ఈ వారంతరంలో ఓటీటీలో మంచి సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు సిద్ధమయ్యాయి. ఇండిపెండెన్స్ డే, శ్రావణ శుక్రవారం కారణంగా వరుస సెలవులను ఉపయోగించుకునేలా ఈ వారంలో మొత్తంగా 23కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యాయి. ఇందులో శుక్రవారం (ఆగస్ట్ 16) నాడు ఏకంగా 11 ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇకపోతే శుక్రవారం స్పెషల్‌ గా రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్ లలో హారర్, బోల్డ్, సూపర్ హీరో జోనర్ సినిమాలతో పాటు ఓ కామెడీ వెబ్ సిరీస్ కూడా విడుదల అవుతున్నాయి. ఇక ఏ సినిమాలు, ఏ వెబ్ సిరీసులు ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఒకసారి చూద్దామా..

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ:

ఆగస్ట్ 16 : వాస్కోడిగామా (తమిళ సినిమా).

ఆగస్ట్ 16 : యే మేరి ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్).

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ:

ఆగస్ట్ 16 : మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్).

ఆహా ఓటీటీ:

ఆగస్ట్ 16 : ఎవోల్ (తెలుగు బోల్డ్ మూవీ).

ఆగస్ట్ 16 : కొంజల్ పెసినాల్ ఎన్న (తమిళ సినిమా).

నెట్‌‌ఫ్లిక్స్ ఓటీటీ:

ఆగస్ట్ 16 : కెంగన్ అసుర సీజన్ 2 పార్ట్ 2 (యానిమేషన్ వెబ్ సిరీస్).

ఆగస్ట్ 16 : ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ (హాలీవుడ్ మూవీ).

ఆగస్ట్ 16 : పెరల్ (ఇంగ్లీష్ హారర్ మూవీ).

ఆగస్ట్ 17 : లవ్ నెక్ట్స్ డోర్ (కొరియన్ వెబ్ సిరీస్).

ఆగస్ట్ 17 : షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ (ఇంగ్లీష్ సూపర్ హీరో చిత్రం).

ఆగస్ట్ 17 : ది గార్‌ఫీల్డ్ మూవీ (యానిమేషన్ సినిమా).

జియో సినిమా ఓటీటీ:

ఆగస్ట్ 16 : బెల్ ఎయిర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్).

సోనీ లివ్ ఓటీటీ:

ఆగస్ట్ 16 : చమక్: ది కంక్లూజన్ (హిందీ మూవీ).

బుక్ మై షో ఓటీటీ:

ఆగస్ట్ 16 : డిస్పకబుల్ మీ 4 (ఇంగ్లీష్ మూవీ).

Exit mobile version