Site icon NTV Telugu

Om Bheem Bush: ‘ఓం భీమ్ బుష్’ సెన్సార్ రివ్యూ వచ్చేసిందోచ్..!

16om

16om

‘ఓం భీమ్ బుష్’ సినిమాపై మొదటి నుండే మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ‘బ్రోచేవారెవరురా’ సినిమాలో అదరగొట్టిన శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కాంబో మరోసారి రిపీట్ అవటంతో ఈ చిత్రంపై చాలా ఆసక్తి నెలకొంది సినీ ప్రేక్షకులకి. అది కాకుండా ఓ కొత్త పాయింట్‍ తో ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నట్లు దర్శకుడు హర్ష కొనుగంటి ఇదివరకే చెప్పారు. సినిమా టీజర్ కూడా కాస్త ఇంట్రెస్టింగ్‍ గా ఉండడంతో ఈ సినిమాపై బజ్ నెలకొంది.

Also read: Bandi Sanjay: విద్యార్థులకు ఆ సినిమా చూపించండి.. సీఎం రేవంత్ కు బండి సంజయ్‌ లేఖ

ఇక సినిమాకి సంబంధించి యు/ఎ (U/A)సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్ సమర్పణలో మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం కాబోతుంది ఈ సినిమా. మార్చ్ 21న ఓవర్సీస్ తోపాటు.. కొన్ని ఇతర ప్రాంతాలలో కూడా ప్రీమియర్‌లు ఉండబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీని పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్‌ ను అందుకుంది. ఇక ఈ సినిమా ఒక సంపూర్ణ కామెడీ అండ్ థ్రిల్లింగ్ జోనర్ లో ఉండబోతుంది. నిధి కోసం వెతుకులాటలో కుటుంబ ప్రేక్షకులను, యువతను మేపించేలా ఈ సినిమా ఉండబోతునట్లు తెలుస్తోంది.

Also read: IPL 2024: ఐపీఎల్‌లోకి టీమిండియా మాజీ క్రికెటర్.. ఇక మైదానంలో మాట‌ల హోరే!

అంతేకాకుండా సినిమా క్లైమాక్స్ లో భారీ ఎమోషన్‌ తో ఊహించని ట్విస్ట్‌ లతో ఉంటుందట. సినిమాలో వినోదం ఎక్కువగా ఉన్నప్పటికీ.. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ హాస్యభరితమైన పాత్రలు ఇందులో ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. సెన్సార్ రివ్యూ రిపోర్ట్స్ పూర్తిగా పాజిటివ్‌గా ఉండడంతో మరో 3 రోజుల్లో సమ్మర్ ట్రీట్ అందించేలా భారీ అంచనాలతో సినిమా విడుదల కానుంది.

Exit mobile version