NTV Telugu Site icon

Bajrang Punia Banned: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. నాలుగేళ్ల నిషేధం

Bajrang Punia Banned

Bajrang Punia Banned

Bajrang Punia Banned ny NADA: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) కఠిన చర్యలు తీసుకుంది. యాంటీ డోపింగ్ కోడ్ ఉల్లంఘించిన కారణంగా ఈ నిషేధాన్ని విధించింది. దీని కింద ఇప్పుడు పూనియాపై 4 సంవత్సరాల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దింతో ఆటగాడిగా అతని కెరీర్ ముగిసిందని భావించవచ్చు. జాతీయ జట్టుకు ఎంపిక ట్రయల్స్‌లో మార్చి 10న డోప్ టెస్ట్ కోసం తన నమూనాను ఇవ్వడానికి నిరాకరించినందుకు బజరంగ్ పునియాను NADA మంగళవారం నాలుగేళ్లపాటు సస్పెండ్ చేసింది. అంతకుముందు, ఏప్రిల్ 23న టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత రెజ్లర్‌ను NADA మొదట సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ప్రపంచ స్థాయి రెజ్లింగ్ సంస్థ UWW (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) కూడా అతనిని సస్పెండ్ చేసింది.

Also Read: RGV : ఏపీ పోలీసుల గాలింపుపై డైరెక్టర్ RGV స్పందన

ఈ సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా బజరంగ్ అప్పీల్ చేసారు. అలాగే NADA అభియోగాల నోటీసును జారీ చేసే వరకు మే 31న NADA క్రమశిక్షణా డోపింగ్ ప్యానెల్ (ADDP) దానిని రద్దు చేసింది. దీని తర్వాత, జూన్ 23న రెజ్లర్‌కు నాడా నోటీసు ఇచ్చింది. ఇకపోతే మరోవైపు, బజరంగ్ పునియా తోటి రెజ్లర్ వినేష్ ఫోగట్‌తో కలిసి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ అతనికి ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. అతను జూలై 11న వ్రాతపూర్వకంగా నేరారోపణను సవాలు చేశాడు. ఆ తర్వాత సెప్టెంబర్ 20, అక్టోబర్ 4న విచారణలు జరిగాయి. వాటి తర్వాత చివరకు ఈ నిషేధం ఎదురుకోవాల్సి వచ్చింది.

Also Read: Duddilla Sridhar Babu : కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది