Site icon NTV Telugu

Olympic Games Athletes: అంబానీ ఇంట ప్యారిస్ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ అథ్లెట్లకు విందు.!

Olympic Games Athletes

Olympic Games Athletes

Olympic Games Athletes: రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఆదివారం (సెప్టెంబర్ 29) ప్యారిస్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌లో పాల్గొన్న 140 మంది క్రీడాకారులను సన్మానించారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ ఆహ్వానం మేరకు ఒలింపిక్, పారాలింపిక్ క్రీడలలో పాల్గొన్న సుమారు 140 మంది అథ్లెట్లు ముంబైలోని ఆమె నివాసంలో సమావేశమయ్యారు. దీంతో పాటు క్రీడా రంగానికి చెందిన ప్రముఖ కోచ్‌లు, పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్రీడాకారులకు పంపిన ఆహ్వాన లేఖలో నీతా అంబానీ.. ‘భారతదేశంలోని ఒలింపిక్, పారాలింపిక్ క్రీడాకారులను సన్మానించడానికి మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానించడం ఒక భారతీయురాలిగా నాకు చాలా సంతోషంగా అలాగే గర్వకారణంగా ఉందని తెలుపుతూ.. మీ ప్రతిభ, సంకల్పం, కృషి దేశం మొత్తం గర్వపడేలా చేసింది అని తెలిపింది. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఒకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి.

ప్యారిస్ ఒలింపిక్స్‌లో 6 ప‌త‌కాలు, పారాలింపిక్స్‌లో భారత పారా అథ్లెట్లు 29 పతకాలు సాధించారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 18వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈ కార్యక్రమంకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version