NTV Telugu Site icon

viral video : వార్నీ.. బామ్మ ఈ వయస్సు లో కూడా తగ్గలేదుగా.. నెటిజన్స్ ఫిదా..

Viral Newsss

Viral Newsss

ఈరోజుల్లో యువకులు ముప్పై రాగానే ఏదైనా పని చెయ్యాలంటే అమ్మా అయ్యా అంటున్నారు.. అలాంటిది ఈరోజుల్లో ముసలి వాళ్లే ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ అద్భుతాలు చేస్తున్నారు.. కొందరు జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తే మరి కొందరు మాత్రం ఔరా అనిపించే విన్యాసాలను చేస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకొనే ఓ బామ్మ కూడా రెస్ట్ తీసుకోవాల్సిన వయస్సులో జిమ్ లో ఫీట్లు చేస్తూ అందరిని షాక్ గురయ్యేలా చేస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

80ఏళ్ల వయస్సులోనూ.. జిమ్​లో వర్కౌట్స్​ ఇరగదీస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ఏజ్​ ఈజ్​ జస్ట్​ ఎ నెంబర్​’ అని నిరూపిస్తోంది ఆ వృద్ధారాలు. ఆమె జిమ్​ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వృద్ధురాలు కనిపిస్తోంది. వివిధ వర్కౌట్స్​ చేస్తూ కనిపించింది. ఆమె పేరు ఎలైన్​​. అదే జిమ్​కు వెళ్లే ఓ మహిళ, ఎలైన్​​​ వర్కౌట్స్​ని వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ‘తన ఫిట్​నెస్​ చూసి షాక్​ అయ్యాను,’ అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చింది.. అదే ఇప్పుడు అందరిని షాక్ కు గురయ్యేలా చేస్తుంది..

ఈ పోస్ట్​ షేర్​ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్​ అయిపోయింది. కొన్ని గంటల్లోనే 5 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. చాలా మంది లైక్స్​ వర్షం కురిపించారు. 80ఏళ్లు వృద్ధురాలి సీక్రెట్​ తెలుసుకునేందుకు విపరీతంగా కామెంట్స్​ చేశారు.. ఆమె ఖుషిని చూసి అందరు షాక్ అవుతున్నారు.. మెచ్చుకొని వాళ్లు అంటూ లేరు.. నెటిజన్లు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. మీరు యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. నిరంతర కృషికి అభినందనలు,’ అని మరో వ్యక్తి కామెంట్​ చేశారు.. మొత్తానికి వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..