NTV Telugu Site icon

Old Man Dance: అయ్యా బాబోయ్.. తాతోయ్ నువ్వు ముసలాడివే కానీ..

Old Man Dance

Old Man Dance

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో డ్యాన్స్ వీడియోలు మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంటాయి.. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి వృద్దులు చేసే డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగచక్కర్లు కొడుతుంటాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో చూసే ఉంటారు.. తాజాగా మరో తాత తనలోని జోష్ ను.. తనలోని హీరోను బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశారు.. అతని డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ఓ పెద్దాయన జీవితంలో ఎన్ని కష్టనష్టాలు చూసి ఉంటారో.. వయసు మీద పడ్డా ఆయనలో ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ‘కోయీ లడ్కీ హై’ అనే పాటకి హుషారుగా స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు… మనుషుల పెదాలపై చిరు నవ్వు తెప్పించే అద్భుతమైన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో ఒకదాని గురించే ఇప్పుడు చెప్పబోయేది. ఓ గ్రూపు మగవారంతా కూర్చుని ఉన్నారు. ఓ పెద్దాయన ‘ దిల్ తో పాగల్ హై’ సినిమాలోని ‘కోయి లడ్కీ హై’ అనే పాటకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా స్టెప్పులు వేశారు. ఆయన మొహంలో ఎంతో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు షేర్ చేశారు..

ఇక ఇంటర్నెట్‌లో నెటిజన్లు ఈయన స్టెప్పులు చూసి భలే మెచ్చుకున్నారు… ముసలాయన డ్యాన్స్ అద్భుతంగా ఉంది. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది’ .. ‘మిమ్మల్ని దేవుడు ఇలాగే సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలి’ అంటూ కామెంట్లు పెట్టారు. వయసు మీద పడగానే ఇక జీవితమే అయిపోయిందని నిరుత్సాహపడేవారు ఈ పెద్దాయన డ్యాన్స్, ఆయన ఉత్సాహం చూస్తే నిజంగా వావ్ అనక మానరు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేసుకోండి.. నిజంగా ఇలా నవ్వుకుంటూ డ్యాన్స్ చెయ్యడం అందరిని ఆకట్టుకుంటుంది.. ఇదొక్కటే కాదు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. గ్రేట్ కదా..