NTV Telugu Site icon

Viral Video: తాత, బామ్మ ఎవ్వారం మాములుగా లేదుగా.. కెటిఎమ్ బైక్ పై రయ్.. రయ్.. అంటూ

Ktm Viral Video

Ktm Viral Video

Viral Video : నేటి యువత కార్లు నడపడం కంటే బైక్‌లు నడపడానికి ఇష్టపడుతున్నారు. స్పోర్ట్స్ బైక్‌లు ముఖ్యంగా యువతలో బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా యువత కెటిఎమ్ బైక్‌లను తోలడానికి బాగా ఇష్టపడతారు. అయితే తాజాగా కెటిఎమ్ మోటార్‌ సైకిల్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఒక వృద్ధ దంపతులు సంతోషంగా కెటిఎమ్ మోటార్‌ సైకిల్‌ ను నడుపుతున్నారు. ఈ వీడియోలో ఒక వృద్ధుడు కెటిఎమ్ బైక్‌ను నడుపుతున్నాడు. అతని భార్య తన తాత వెనుక కూర్చుని అతని బైక్ రైడ్‌ను ఆస్వాదిస్తోంది. వారు తమ కెటిఎమ్ బైక్ పై వీధిలో నడుపుతుండగా., రోడ్డుపై వెళ్తున్న మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది. వృద్ధ దంపతులు తమిళనాడుకు చెందిన వారని తెలుస్తోంది.

The Great Indian Kapil Show: మరింత జోష్ తో సీజన్ 2 మొదలెట్టబోతున్న కపిల్ షో..

తమిళనాడుకు చెందిన ఓ వృద్ధ దంపతులు కేటీఎం ఆర్సీ 390 మోటార్‌ బైక్ పై ప్రయాణిస్తున్నారు. వైరల్ వీడియోను చూస్తుంటే, బైక్‌పై ఉన్న వృద్ధుడు, వెనుక కూర్చున్న వృద్ధురాలు ఇద్దరూ షూటింగ్ రేంజ్‌లో రైడ్‌ ను ఆస్వాదించడం చూడవచ్చు. వాటి మధ్య బట్టల బుట్ట కూడా ఉంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వీడియోను లక్షలాది మంది చూస్తున్నారు. వృద్ధ దంపతులపై పలువురు వ్యాఖ్యానిస్తూ.. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెటిఎమ్ బైక్ను నడపడానికి వయస్సు తప్పనిసరి కాదని తాత గుర్తించాడు. ఇది కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించబడిందని ఓ వ్యక్తి కామెంట్ చేసాడు.

Tata Nexon CNG Launch: సరికొత్త ఒరవడిని సృష్టించడానికి సిద్దమవుతున్న టాటా నెక్సాన్..

ఈ వృద్ధ దంపతులు ఎక్కడెక్కడో తమ బైక్‌ పై ఆనందంగా వెళుతున్నారు. అయితే బైక్ తోలుతున్న తాత హెల్మెట్ పెట్టుకోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సైకిల్‌పై వెళ్లే వారు హెల్మెట్ ధరించే అలవాటు ఉండదు కాబోలు. తక్కువ దూరాలకు లేదా పొలాల్లో కూడా బండ్లను ఉపయోగించడం వారికి అలవాటు.