Site icon NTV Telugu

Hyderabad: పాతబస్తీ భారీ అగ్ని ప్రమాదంపై వీడిన సస్పెన్స్‌..

Hyd1

Hyd1

Hyderabad: పాతబస్తీ గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో శాలిబండ భారీ అగ్ని ప్రమాదంపై సస్పెన్స్ వీడింది.. ముందుగా గోమతి ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.. రిఫ్రిజిరేటర్లు, ఏసీ కంప్రెషర్లలో భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి షోరూమ్‌ ముందు పార్క్ చేసిన కారు పల్టీలు కొట్టింది.. అద్దాలు పగలగొట్టి డ్రైవర్ బయటపడ్డాడు.. కాసేపటికే మంటలు వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పేళ్లులు ధాటికి కొన్ని మీటర్ల వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎగిరిపడ్డాయి..

READ MORE: Dharmendra : హేమమాలినితో రెండో పెళ్లికి వెనకున్న నిజాలు, అప్పటి హాట్ టాపిక్స్.. !

అయితే.. రాత్రి స్పీడ్‌గా వచ్చిన ఓ కారు గోమతి ఎలక్ట్రానిక్ షాపును ఢీ కొట్టడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని మొదట వాదనలు వినిపించాయి. తాజాగా ఆ కారు డ్రైవర్ మణికంఠ ఎన్టీవీతో మాట్లాడారు. “రాత్రి 10:30కి ఏదో పెద్ద బ్లాస్ట్ అయినట్టుగా ఒక్కసారిగా శబ్దం వినిపించింది. శబ్దం రావడంతో నా కారు పల్టీ కొట్టింది.. కారుకు సంబంధించిన గ్లాస్ మొత్తం ధ్వంసం అయిపోయింది.. కారులో నేను ఒక్కడినే ఉన్నాను.. కారు ముందు అద్దాలని పగలగొట్టి బయటపడ్డాను.. నేను బయటికి రాగానే కారు మొత్తం పూర్తిగా కాలిపోయింది సీఎన్జీ సిలిండర్ ఏమి పేలలేదు.. M/S EVEREST FLEET COMPANY PRIVATE LIMITED అనే కంపెనీ పేరుతో ఉన్న ఉబెర్ కారు నడుపుతున్నాను. చార్మినార్ దగ్గర ప్యాసింజర్స్‌ని డ్రాపింగ్ చేశాను.. మరో పికప్ శాలిబండ సైడ్ పడింది అక్కడికి బయలుదేరాను.. గోమతి ఎలక్ట్రానిక్ షాప్ దగ్గర భారీ శబ్దం వచ్చింది.. ఎలా వచ్చిందో తెలియదు వెంటనే నా కారు కూడా బోల్తా పడింది..” అని వెల్లడించాడు.

Exit mobile version