హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ దివాన్‌దేవిడిలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రూ.60-100 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దాదాపు 400 బట్టల దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజు తర్వాత ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగింది. దాదాపు 20 ఫైర్ ఇంజన్లతో 24 గంటల పాటు మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించింది.
Also Read: Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రాపై నిర్ణయం నేడు!
పాతబస్తీలోని మదీనా, అబ్బాస్ టవర్స్‌లో సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. భవనం నాలుగో అంతస్తులోని వస్త్ర దుకాణం నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న ఇతర దుకాణాలకు కూడా వ్యాపించాయి. స్థానికులు సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తీవ్రంగా శ్రమించింది. 24 గంటల పాటు భవనం మంటల్లోనే ఉంది. నాలుగో అంతస్తు పూర్తిగా కుప్పకూలిపోవడంతో భవనం పనికిరాదని మున్సిపల్ అధికారులు అంచనా వేశారు. జేఎన్టీయూ సాంకేతిక సిబ్బందితో పరీక్షలు చేయించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద అగ్నిప్రమాదంగా అధికారులు తేల్చారు. రూ.60 నుంచి 100 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.