Ola S1 Range Electric Scooters Bookings: ప్రముఖ దేశీయ ఎలక్ట్రిక్ దిగ్గజం ‘ఓలా ఎలక్ట్రిక్’ దూసుకుపోతోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన ఈ-స్కూటర్ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ధర రూ. 90000 నుంచి రూ. 150000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఆగస్ట్ 15న కొత్త S1 సిరీస్ లాంచ్ అయింది. అదే ఇప్పుడు బలమైన మార్కెట్ కలిగి ఉంది. S1 లైనప్‌కు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 15 రోజుల్లో 75,000 కంటే ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్‌లను పొందింది. రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అధికారి మాట్లాడుతూ… ‘మా కొత్త S1 లైనప్‌కి లభించిన స్పందనతో మేము థ్రిల్ అయ్యాము. విద్యుదీకరణలో దేశ నాయకత్వానికి మద్దతు ఇవ్వడానికి మేము స్పష్టమైన దృష్టితో పని చేస్తున్నాము’ అని తెలిపారు. ఇంధనంతో నడిచే స్కూటర్‌తో పోలిస్తే.. ఇటీవల లాంఛ్ అయిన ఓలా S1Xతో వినియోగదారులు నెలకు రూ. 2,600, సంవత్సరానికి రూ. 30,000 ఆదా చేయవచ్చని ఓలా ఎలక్ట్రిక్ అంటోంది. ఈ పొదుపుతో వినియోగదారులు తమ స్కూటర్ ధరను కేవలం మూడేళ్లలో తిరిగి పొందవచ్చని కంపెనీ తెలిపింది.
Also Read: Asia Cup 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్, కోహ్లీ పోటీ.. మరి గెలుపెవరిదో?
ఎస్1 ఎయిర్ వినియోగదారులు సంవత్సరానికి గరిష్టంగా రూ. 1,900, ఏడాదికి రూ. 23,000 ఆదా చేయవచ్చు. అలానే ఎస్1 ప్రో కస్టమర్లు నెలకు రూ. 1,100, ఏడాదికి రూ. 13,000 ఆదా చేయవచ్చు. రోజువారీ ప్రయాణం 30 కిలోమీటర్ల ఆధారంగా ఓలా ఈ లెక్కలు తేల్చింది. ఆగష్టు 15న ఓలా ఎలక్ట్రిక్.. ఎస్1ఎక్స్ మోడల్‌ను పరిచయం చేసింది. S1 X+, S1 X (2kWh), S1 X (3kWh) వేరియంట్‌లను పరిచయం చేసింది. S1 X+ (3kWh), S1 X (3kWh) రెండూ 6kW మోటార్, 3kWh బ్యాటరీ.. 151 కిమీ రేంజ్, గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళ్తాయి. S1 X (2kWh) 6kW మోటార్‌తో వస్తుంది. దీని రేంజ్ 91 కిమీ కాగా.. గంటకు 85 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. S1 X+ స్కూటర్ రూ. 109,999 ధర కాగా.. డెలివరీలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయి.