Site icon NTV Telugu

Ola Roadster X: ఓలా ఎలక్ట్రిక్ సంచలనం.. స్టైలిష్ లుక్, స్పోర్టీ ఫీల్‌తో తొలి బైక్ విడుదల.. తక్కువ ధరకే

Ola

Ola

ఈవీ రంగంలో ఓలా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఓలా స్కూటర్లు మార్కెట్ లో హల్ చల్ చేయగా ఇప్పుడు ఓలా బైకులు దుమ్మురేపనున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ తన తొలి రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్పోర్టీ ఫీల్‌తో వచ్చిన ఈ బైక్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే లభించనుంది. ఈ నెలలోనే డెలివరీలు ప్రారంభంకానున్నాయి. ఓలా రోడ్‌స్టర్ X మూడు బ్యాటరీ ఆప్షన్స్ తో రిలీజ్ అయ్యింది. 2.5kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ ధర రూ. 84,999. 3.5 kWh బ్యాటరీ ఉన్న వేరియంట్ ధర రూ. 94,999. 4.5 kWh బ్యాటరీ ఆప్షన్ ఉన్న వేరియంట్ ధర రూ.1,04,999, రోడ్‌స్టర్ X+ 9.1kWh రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రారంభించారు.

Also Read:NKR 21 : అన్న కోసం తమ్ముడు తారక్.. నేడు గ్రాండ్ ఈవెంట్

రోడ్‌స్టర్ ఎక్స్ లో 4.3-అంగుళాల LCD కలర్ సెగ్మెంటెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇందులో స్మార్ట్ కనెక్టివిటీ, USB ఉన్నాయి. ఇది MoveOS 5 ద్వారా శక్తిని పొందుతుంది. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది.. స్పోర్ట్స్, నార్మల్, ఎకో. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. ఇది అనేక స్మార్ట్ ఫీచర్లు, కనెక్టివిటీతో అమర్చబడి ఉంటుంది. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇది తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. సింగిల్ ఏబీఎస్ తో బ్రేక్ బై వైర్ టెక్నాలజీని అందించారు. IP67-రేటెడ్ బ్యాటరీ సిస్టమ్, అధునాతన వైర్ బాండింగ్ టెక్నాలజీ అందించారు. క్రూయిజ్ నియంత్రణ, రివర్స్ మోడ్ వంటి వివిధ రకాల డిజిటల్ సాంకేతిక సామర్థ్యాలను కలిగి ఉంది.

Exit mobile version