Ola Electric Bike To Be Launched in India On August 15: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పలు కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లను రిలీజ్ చేశాయి. వీటిల్లో ‘ఓలా’ కూడా ఉంది. భారత దేశానికి చెందిన ఓలా కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకెళుతోంది. ఎక్కువ మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఓలా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ బైక్స్ (Ola Electric Bikes) కూడా మార్కెట్‌లోకి తీసుకురావాలని చూస్తోంది.
Ola Electric Bike Launch:
ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆగష్టు నెలలో ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లో ఆవిష్కరించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఓలా కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్మీడియా ట్వీట్స్ ప్రకారం.. 15 ఆగస్ట్ 2023న భారతదేశంలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయబడుతుందని తెలుస్తోంది. దీనితో పాటుగా ఓలా ఎలక్ట్రిక్ S1 ప్రో కొత్త కలర్ వేరియంట్‌లు రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉందట.
Also Read: Mohammed Siraj Catch: డైవింగ్ చేస్తూ.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! సిరాజ్ వీడియో వైరల్
Ola Electric Bike Range:
కొత్త ఓలా ఎలక్ట్రిక్ బైక్ అంచనా ధర, రేంజ్ మరియు డిజైన్ వివరాలను ఓసారి చూద్దాం. ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లో రేంజ్ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఓలా బైక్ ఏకంగా 300 నుంచి 350 కిమీ వరకు వెళుతుందట. ఓలా బైక్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే ఛాన్స్ ఉంటుంది. రోజువారీ ప్రయాణాలకు మరియు సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్లేవారికి ఈ బైక్ ఉపయోగకరంగా ఉండనుంది.
Ola Electric Bike Price:
భారతదేశంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 2.50 లక్షల కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. అత్యుత్తమ పనితీరు మరియు సూపర్ ఫీచర్లు ఈ బైక్‌లో ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ బైక్ కొనేవారు కొన్ని రోజులు ఆగితే.. ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనేసుకోవచ్చు. కేవలం స్కూటర్లు, బైక్స్ మాత్రమే కాకుండా.. ఓలా కంపెనీ భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది. దాంతో ఓలా క్రమక్రమంగా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో దూసుకుపోవాలని భావిస్తోంది.
Also Read: R Ashwin Records: ఆర్ అశ్విన్ పాంచ్ పటాకా.. 4 రికార్డ్స్ బద్దలు! తొలి భారత బౌలర్‌గా