లింక్డిన్ పై ఓలా సీఈవో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ చేసిన ఓ పోస్ట్‌ను లింక్డిన్ తొలగించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. భారత్ సొంతంగా ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా.. భవీష్ కి సంబంధించిన ఓ పోస్ట్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం లింక్డిన్ తొలగించింది. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లింక్డిన్ ఏఐ టూల్స్ భారత యూజర్లపై బలవంతంగా పాశ్చాత్య సిద్ధాంతాలను రుద్దుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే భారత్ సొంతంగా సాంకేతికతను, కృత్రిమ మేధను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ఇతరుల రాజకీయ లక్ష్యాలకు బానిసలుగా మారాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
READ MORE: Neom: ప్రాజెక్టు అడ్డుపడ్డ వారిని చంపేయండి.. సౌదీ అరేబియా కీలక వ్యాఖ్యలు
అసలేంజరిగిందంటే.. ఇటీవల భవీష్ అగర్వాల్ తన గురించి తాను తెలుసుకునేందుకు లింక్డిన్‌లోని ఏఐ బాట్‌లో ‘‘భవీష్ అగర్వాల్ ఎవరు?’’ అని వెతికారు. దీనికి బాట్ ఇచ్చిన సమాధానంలో తప్పులను ఆయన గమనించారు. ‘ఆయన’ అని ఉండాల్సిన చోట ‘వారు/వాళ్లు’ అని పేర్కొనడాన్ని ఆయన సహించలేదు. దీన్ని స్క్రీన్‌షాట్ తీసిన భవీష్ లింక్డిన్‌లో పోస్ట్ చేశారు. పాశ్చాత్య విధానాలను గుడ్డిగా అనుసరిస్తే ఇలా ‘ప్రొనౌన్స్ ఇల్‌నెస్’ ఎదుర్కోవాల్సి వస్తుందని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తమ విధానాలను విరుద్ధంగా ఉందని పేర్కొంటూలింక్డిన్ దానిని తొలగించింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన భవీష్.. తమ తప్పుని గుర్తించకుండా లింక్డిన్ ఇతరులను విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. అందుకే భారత్ సొంతంగా తమ సాంకేతికతలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పలువురు సమర్థిస్తున్నారు.