Tarakaratna : తారకరత్న ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలోని పాటలు ఇప్పటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘నువ్వు చూడు చూడకపో’ పాట ప్రతి లవ్ ఫెయిల్యూర్ పాడుకునే పాట. అంతే కాకుండా ఈ పాట చాలా సినిమాల్లో బాగా ట్రోల్ అయింది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్. ఎంఎం కీరవాణి బాణీలు అందించగా ఈ పాటను కీరవాణి, గంగా ఆలపించారు. అంతే కాకుండా ఈ సినిమాలోని ఆరు పాటలు కూడా ఇండస్ట్రీ హిట్స్. కొంతకాలం పాటు ట్రెండింగ్ లో నిలిచాయి. తొడగొట్టి… చెబుతున్న పాట తారకరత్నను ఎల్లప్పుడూ గుర్తు చేసుకునేలా ఉంటుంది.
Read Also: Taraka Ratna – NTR : ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తారకరత్నకు అండగా నిలిచిన ఎన్టీఆర్
అలాంటి ఆల్ టైం హిట్ పాటలను అందించిన సినిమా తారకరత్న కెరీర్ లో ఓ మైలు రాయి. ఇలాంటి అదృష్టం చాలా తక్కువమంది హీరోలకి వస్తుంది. అంతటి భారీ హిట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తారకరత్న ఎందుకో కాలం కలిసిరాక కొన్నాళ్లు ఇబ్బందులు పడ్డాడు. హీరోగానే కాకుండా తొలి సారిగా విలన్ గా నటించిన అమరావతి సినిమా ద్వారా కూడా నంది అవార్డు దక్కించుకున్నారు. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో తారకరత్న ప్రేక్షకులను భయపెట్టేశాడు. కొత్త కాన్సెప్ట్ తో తనదైన మార్క్ విలనిజంతో సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాడు.