తెలంగాణాలో ఆయిల్‌పామ్ ను అధికంగా సాగు చేస్తున్నారు.. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో రైతులు పైసా ఖర్చు లేకుండా వేలాది ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారు.. గద్వాల, కల్వకుర్తి ప్రాంతాల్లోనే ఎక్కువగా పండిస్తున్నారు.. దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ పంటను పండిస్తున్నారు.. ఇక్కడ పండించి విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.. రాబోయే కాలంలో లక్షల ఎకరాల్లో వీటిని పండించాలని రైతులను ప్రోత్సహిస్తుంది.. అందుకే రైతులకు రాయితీని కూడా అందిస్తుంది..
ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 60 వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. ఇప్పటికే రూ.150 కోట్లతో బీచుపల్లి వద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సిద్ధం చేశారు. వచ్చే ఏడాది 24 వేల ఎకరాల తోటల్లో పంట చేతికి వస్తుంది. ఎర్రవల్లి వద్ద రూ.250 కోట్లతో మరో ఫ్యాక్టరీ సిద్దం చేస్తున్నారు. అందుకు అవసరమైన భూములకు జాతీయ రహదారి పక్కనే కేటాయించారు. 94 ఎకరాల్లో మిల్లు ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిందని ప్రభుత్వం వెల్లడించింది..
ఇక్కడ పండించిన పంటను కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు తరలించాల్సి వస్తుంది.. దాంతో రవాణా కూడా దూరం కావడంతో రైతులు ఈ పంటను ఎక్కువగా పండించలేకపోతున్నారు.. జోగులాంబ జిల్లాలో ఆయిల్‌పామ్ పరిశ్రమ ఏర్పాటుతో 500 మందికి ప్రత్యక్షంగా, 1500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. మొత్తం 2 వేల మందికి పని దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. స్థానికంగా గెలలు కోసేందుకు కూడా కూలీలకు మంచి డిమాండ్ వస్తుందని ఉధ్యాన శాఖ చెబుతోంది.వచ్చే ఏడాది నాటికి జిల్లాలో 50 వేల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. ఇక్కడ మిల్లు పడితే ఆయిల్ కు డిమాండ్ కూడా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు..