Site icon NTV Telugu

Oil Free Mutton Paneer: ఆయిల్ లేకుండానే అదిరిపోయే మటన్ పన్నీర్.. ఒక్కసారి తిన్నారంటే!

Pannir

Pannir

Oil Free Mutton Paneer: ప్రస్తుతం చాలా మంది వంటల్లో నూనె ఎక్కువగా ఉపయోగిస్తేనే మంచి రుచి వస్తుందనే భావనలో ఉండి ఉంటారు. కానీ నిజానికి తక్కువ నూనెతోనే కాదు, అసలు నూనె లేకుండానే కూడా అద్భుతమైన, ఆరోగ్యకరమైన కూరలు సిద్ధం చేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఒకటి జీరో ఆయిల్ మటర్ పన్నీర్.. ఇది రుచికరంగా ఉండడమే కాదు, మంచి పోషకాలను అందజేస్తుంది.

Read Also: Off The Record : నరసన్నపేట పొలిటికల్ స్క్రీన్‌పై మారుతున్న సీన్స్..

కావలసిన పదార్థాలు:
* పనీర్ – 200 గ్రాములు
* పచ్చి బఠాణీలు – 100 గ్రాములు
* టొమాటోలు – హాఫ్ కేజీ కిలో
* ఉల్లిపాయలు – 3
* పచ్చిమిర్చి – 2
* అల్లం – 2 అంగుళాల ముక్క
* వెల్లుల్లి రెబ్బలు – 6
* జీడిపప్పులు – 10
* కసూరీ మేథీ – 1 టేబుల్ స్పూన్
* మిరియాల పొడి – అర స్పూన్
* ధనియాల పొడి – 1 స్పూన్
* జీలకర్ర పొడి – 1 స్పూన్
* గరం మసాలా – 1 స్పూన్
* కారం – 1 స్పూన్
* ఉప్పు – రుచికి తగినంత
* నిమ్మరసం – 1 స్పూన్
* కొత్తిమీర తరుగు – గుప్పెడు

Read Also: Toxic : ‘టాక్సిక్’ దర్శకురాలు గీతూ మోహన్ దాస్.. తెలుగులో హీరోయిన్ గా నటించిన సంగతి తెలుసా?

తయారీ విధానం
అయితే, ముందుగా పచ్చి బఠానీలను ఉడికించి పక్కన ఉంచుకోవాలి.. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టామాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.. వీటిని కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టాలి.. అది చల్లారిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి, జీడిపప్పులు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ గా తయారు చేసుకోవాలి.. ఈ పేస్టును అదే కడాయిలో వేసి గ్యాస్ ని సిమ్ లో పెట్టాలి.

ఇక, ఇప్పుడు ఉడికించిన బఠానీలు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ మరిగించాలి. తర్వాత పనీర్ ముక్కలు, కసూరీ మేథీ వేసి మరో రెండు నిమిషాల పాట ఉడకబెట్టాలి.. చివరగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపి మంట ఆపేయాలి.. అంతే, నోరూరించే జీరో ఆయిల్ మటర్ పనీర్ రెడీ అవుతుంది.

కాగా, నూనె లేకుండా వంటలు తయారు చేసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుంది. పన్నీర్, బఠానీల వల్ల ప్రోటీన్ సమృద్ధిగా దొరుకుతుంది. తక్కువ కేలరీలతో ఎక్కువ పోషకాహారం లభించినట్లు అవుతుంది. దీన్ని అన్నంతో పాటు చపాతీ, రోటీలకు కూడా తినొచ్చు.

Exit mobile version