Site icon NTV Telugu

Gas Cylinder: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు..!

Gas

Gas

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి (ఏప్రిల్‌ 1) నుంచి గ్యాస్‌ ధరలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు, 5 కిలోల ఎఫ్‌టీఎల్ (ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ) సిలిండర్‌ల ధరలను తగ్గిస్తున్టన్లు ప్రకటించింది. ఇక, సవరించిన ధరల ప్రకారం.. చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై 30 రూపాయల 50 పైసలు తగ్గించింది. ఢిల్లీలోని ధరల శ్రేణి ప్రకారం కొత్త ధర 1764.50 రూపాయలుగా నిర్ణయించారు.

Read Also: Lok Sabha Elections 2024: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. నేడు అభ్యర్థులను ప్రకటించే అవకాశం..?

అయితే, ముంబయిలో 1719 రూపాయలగా సిలిండర్ ధర ఉంది. చెన్నైలో 1930 రూపాయలు, కోల్‌కతాలో 1881 రూపాయలుగా ఉండనుంది. ఇక, 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ ధరను 7.50 రూపాయలకు తగ్గించింది. అయితే ఈ ధరలను క్రూడ్‌ ఆయిల్ కంపెనీలు మార్చిలో పెంచిన విషయం తెలిసిందే. మారుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్‌ లభ్యత లాంటి పరిస్థితుల కారణంగా తాజాగా రేట్లను తగ్గిస్తున్నట్లు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. అలాగే, గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పులు లేవని తెలిపింది. 14.2 కేజీకు 855 రూపాయలుగానే ఉంచినట్లు తెలిసింది. ఇటీవలే ఈ ధరను 955 రూపాయలు ఉండగా 100 రూపాయలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

Exit mobile version