OG Movie: పవన్ ఎన్నికల్లో బిజీ అయినా అనుకున్న రోజుకే దింపుతాం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.. ఒకటి ‘OG ‘ కూడా ఒకటి.. రన్ రాజా రన్, సాహో చిత్రాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. అయితే సినిమా విడుదల వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి..
గతంలో వచ్చిన అప్డేట్స్ అన్ని కూడా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.. అయితే సినిమా నుంచి కేవలం పోస్టర్,గ్లింప్స్ విడుదలయ్యాయి. వాటికి మంచి స్పందన వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, షాన్ కక్కర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.. ఈ సినిమా కథ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఈ సినిమాలో పవన్ మాఫియా డాన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కానీ కథ ప్రకారం మాఫియా డాన్ అయిన పవన్ కొన్ని కారణాల వల్ల పదేళ్లుగా మాఫియాకు దూరంగా ఉంటాడు. 10 సంవత్సరాల విరామం తర్వాత అతను మాఫియాపై బరిలోకి దిగి శత్రువును అంతం చేస్తాడు. ఇదే ఈ సినిమా ప్రధాన కథ అని వినిపిస్తోంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలిసిందే.. ప్రస్తుతం ఏపీ లో ఎన్నికలు రాబోతున్నాయి.. దాంతో ఎన్నికల వరకు ఓజీ షూటింగ్లో పాల్గొనలేనని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం.. ఎన్నికల తర్వాత పవన్ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది.. అప్పటినుంచి షూటింగ్ పూర్తి చేసి సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు..
తాజావార్తలు
-
Shiva: జపాన్‌లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..