పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఓజి’. ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజీత్ మెగాఫోన్ పట్టగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను ఆకాశాన్ని అంటించేలా చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మొదటి పాట విడుదలపై ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది.
Also Read : Tollywood : టాలీవుడ్ విలన్ బోరబండ భాను అకాల మరణం – ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు, ‘ఓజి’ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల కానుంది. ఆగస్ట్ 3 లేదా 5 తేదీల్లో ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌తో పాటుగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఫ్యాన్స్ ఈ సాంగ్ కోసం భారీ ఎగ్జైట్మెంట్‌లో ఉన్నారు. ఈ చిత్రాన్ని DVV ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోండగా, పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్నా, ‘ఓజి’ కోసం చేసిన కమ్‌బ్యాక్ హంగామా ప్రేక్షకుల్లో పజిటివ్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో థమన్ సంగీత బాణీలు మరోసారి మ్యాజిక్ చేస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
