Site icon NTV Telugu

Off The Record : నెల్లూరు టీడీపీలో పాత YCP నేతలదే పెత్తనమా? తమ్ముళ్ల అసహనం కట్టలు తెంచుకుంటోందా?

Nellore Tdp

Nellore Tdp

అక్కడ టీడీపీలో యుద్ధ వాతావరణం ఉందా? పాత తెలుగుదేశం నేతలంతా రగిలిపోతున్నారా? వైసీపీ నుంచి జంప్‌ అయిన వచ్చిన నేతకు వేల కోట్ల రూపాయల లబ్ది చేకూరుస్తున్నారంటూ వాళ్ళకు ఎక్కడో కాలిపోతోందా? పాతవాళ్ళు, పార్టీ మారినవాళ్ళు అంటూ గీతలు గీసుకుంటున్న రాజకీయం ఎక్కడ జరుగుతోంది? టీడీపీ అధిష్టానం ఏం చేస్తోంది? రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే…. ఇక కష్టాలు తీరిపోయాయ్‌….. మన మాటకు తిరుగుండదని భావించారట సింహపురి టీడీపీ లీడర్స్‌. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆమోదంతోనే ఏ పని అయినా చేయాలని పార్టీ అధినేత చంద్రబాబు కూడా చెప్పడంతో… ఇక తిరుగులేదని అనుకున్నారట. కట్‌ చేస్తే… సీన్‌ రివర్స్‌ అయిందంటూ తలబాదుకుంటున్నట్టు సమాచారం. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన నాయకులే ఇప్పుడు పసుపు కండువాలు కప్పుకుని అదే పని చేస్తున్నారని, ఇక మన మాట చెల్లేది ఎక్కడ? ఎప్పుడు అంటూ పాత తమ్ముళ్ళలో అసహనం పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అప్పట్లో మంత్రిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్… వ్యవహారాలను ఆయనకు బాబాయ్ వరస అయ్యే రూప్‌ కుమార్ యాదవ్ చూసేవారు. ముఖ్యంగా మైనింగ్‌ మీదే వాళ్ళ దృష్టి ఎక్కువగా ఉండేదని చెప్పుకునే వాళ్ళు. ఇష్టారాజ్యంగా ప్రభుత్వ.. ప్రైవేటు… అటవీ భూములలో తెల్లరాయి, మైకా, సిలికా, ఇసుక లాంటి వనరులను ఇష్టానుసారం కొల్లగొట్టి కోట్లు గడించారన్న ఆరోపణలున్నాయి. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌ మీద చర్యలు తీసుకోమంటూ… అప్పట్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి … మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ… కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలు ఆందోళనలు చేశారు. సోమిరెడ్డి అయితే దీక్షలు కూడా చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక తోలు తీస్తామని కూడా వార్నింగ్స్‌ ఇచ్చారు అప్పట్లో. కానీ…. అధికారం వచ్చాక స్క్రీన్‌ మీద సీన్‌ మారిపోయింది. నాడు వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వ్యవహారాలు చూసిన ఆయన బాబాయ్‌ రూప్ కుమార్ యాదవ్, పలువురు నేతలు టిడిపిలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అయ్యారు. ఆయన అండతో అనుచరుడు రూప్‌కుమార్‌ యాదవ్‌ తిరిగి అంతకంటే ఉధృతంగా మైనింగ్‌ చేస్తున్నాడంటూ రగిలిపోతున్నారట పాత టీడీపీ నాయకులు. గూడూరులోని ఓ కంపెనీ దగ్గర స్క్రాప్ కింద నిల్వచేసిన తెల్ల రాయిని తరలించేందుకు అనుమతులు తీసుకుని… ఆ మాటున గనుల్లో కూడా అక్రమంగా తవ్వి ఎక్స్‌పోర్ట్‌ చేసి కోట్లు గడించారన్న ఆరోపణలున్నాయి. సైదాపురంలోని రెండు గనుల్లో కూడా ఇదే తరహా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం.

ప్రభుత్వానికి ఫీజులు…డెడ్ రెంట్.. లీజులు చెల్లిస్తున్న యజమానులను కాదని రూప్ కుమార్ యాదవ్ ..అతని అనుచరులు మైనింగ్ చేయడం చూస్తుంటే స్థానిక టిడిపి పాత నేతలకు ఎక్కడో కాలిపోతోందట. అయితే… ఇక్కడ కీలకంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండ ఉండటం, పార్టీ అధిష్టానం కూడా అంటీ ముట్టనట్టు ఉండటంతో… వాళ్ళు ఏం చేయలేక పళ్ళునూరుకుంటున్నట్టు తెలుస్తోంది. మొదటినుంచి టిడిపిని నమ్ముకుని పనిచేస్తున్న తమకు అనుమతులు ఇవ్వకుండా వైసిపి నుంచి ఎన్నికల సమయంలో వచ్చిన నేతకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నది వాళ్ళ క్వశ్చన్‌. ఈ విషయాన్ని కొందరు సీనియర్ లీడర్స్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్టు తెలిసింది. ఇప్పటికీ అట్నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేదు, ఇక్కడ మాత్రం అక్రమ మైనింగ్ మాత్రం జోరుగా జరిగిపోతోందంటూ చేతులు నలుపుకుంటున్నారట కొందరు నెల్లూరు టీడీపీ లీడర్స్‌. ఒక నాయకుడు ఓ అడుగు ముందుకేసి అక్రమ మైనింగ్‌ని అడ్డుకోవాలంటూ.. రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్‌ని ఆదేశించారట. ఆ వాహనాలను ఆయన పట్టుకోవడంతో…. వెంటనే ట్రాన్స్ఫర్‌ అయిపోయింది. ఈ విషయంలో వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట ఎమ్మెల్యేలు సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డవారిని కాదని వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకు మైనింగ్‌ పర్మిషన్స్‌ ఇచ్చేయడమంటే తమను అవమానించినట్టు కాదా? ఆ మాత్రం మైనింగ్‌ మేం చేసుకోలేమా అని మండి పడుతున్నట్టు తెలిసింది. పైకి మైనింగ్‌ కంపెనీలు మారినట్టు కనిపిస్తున్నా… వెనకుండి నడిపిస్తోంది మాత్రం రూప్‌కుమార్‌ యాదవేనన్నది పాత టీడీపీ నేతల ఆరోపణ. జిల్లాలోని గనుల వ్యవహారాలను ఒకరికే అప్పగించడం మంచిది కాదని అంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి. మిగతా ఎమ్మెల్యేలందరిదీ ఇదే అభిప్రాయం అట. పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కనపెట్టి ఒక నేతకే వేల కోట్ల రూపాయల లబ్ది చేకూరేలా ఎలా వ్యవహరిస్తారన్నది వాళ్ళ క్వశ్చన్‌. రేయింబవళ్ళు జరుగుతున్న అక్రమ మైనింగ్‌తో ఇప్పటికే లక్ష టన్నులకు పైగా తెల్ల రాయిని తరలించినట్టు చెబుతున్నాయి అనధికారిక లెక్కలు. క్వాంటిటీ విషయంలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా…. మైనింగ్‌ వ్యవహారం మాత్రం సింహపురి టీడీపీలో యుద్ధ వాతావరణాన్ని పెంచుతోంది. అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోకుంటే… ఏదో ఒక రోజు బ్లాస్ట్‌ అయి తేడా కొట్టడం ఖాయమంటున్నారు పరిశీలకులు.

Exit mobile version