Site icon NTV Telugu

Off The Record: జూబ్లీహిల్స్ జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతుంది?

Otr

Otr

Off The Record: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో జంబో బ్యాలెట్‌ ఎవరి కొంప ముంచబోతోంది? నెక్‌ టు నెక్‌ ఫైట్‌లో వాళ్ళ ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? 58 మంది అభ్యర్థులు బరిలో ఉంటే… అందులో 48 మంది నాన్‌ లోకల్సే ఎందుకున్నారు? అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మీద కూడా పగ తీర్చుకోవడానికి నామినేషన్స్‌ వేశారా? రెండు పార్టీలను ఒకేసారి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఎక్కడైనా ఎన్నికలంటే… సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఓ నలుగురైదుగురు ఇండిపెండెంట్స్‌ బరిలో ఉంటారు. కానీ… ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. నామినేషన్స్‌ దాఖలుకు ఆఖరు రోజున సాయంత్రం 3 గంటలు డెడ్‌లైన్‌ కాగా… అప్పటి వరకు క్యూలో నిలబడ్డ అభ్యర్థుల నుంచి పత్రాలు స్వీకరించడానికే తెల్లవారు ఝాము అయిపోయింది. జనరల్‌గా ఓటేయడానికి కూడా ఆ టైం వరకు క్యూలో ఉండరు.

Snapdragon 8 Elite చిప్‌, 7500mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ తో iQOO Neo11 లాంచ్..!

అలా… మొత్తం 211 మంది 321 నామినేషన్లు వేశారు. అందులో ఎక్కువ శాతం స్క్రూటినీలో రిజెక్ట్‌ అయ్యాక కూడా 81 మంది బరిలో మిగిలారు. ఇక ఆ తర్వాత 23 మంది ఉపసంహరించుకోగా… చివరకు 58 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయినా… ఇది కూడా తక్కువ సంఖ్యేంకాదు. ఆ 58 మందిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మొత్తం 10 మంది స్థానికులు కాగా మిగతా 48 మంది నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేని బయట వాళ్లే. ఇక్కడే ఓ కొత్త చర్చకు తెర లేచింది. నియోజకవర్గంతో సంబంధం లేకున్నా అలా… భారీగా నామినేషన్లు వేశారంటే….అది ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత అంటూ ప్రచారం మొదలైంది.

ఇక్కడ ఇంకో ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే… ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష పార్టీ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు సైతం నామినేషన్స్‌ వేశారట. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీర్‌ఖాన్‌పేట, యాచారం, ముచ్చర్ల, కడ్తాల్ పరిసర ప్రాంతాల్లో ఫార్మాసిటీ పేరుతో జరిగిన భూ సేకరణను అక్కడి రైతులు వ్యతిరేకించారు. అలాగే… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే…. ఆ భూములను రైతులకు తిరిగి ఇస్తామని ప్రకటించినా, ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలు పెట్టకపోవడంతో కాంగ్రెస్‌ను కూడా వ్యతిరేకిస్తున్నారు. అలా ఫార్మా సిటీ భూ బాధితులంతా… జూబ్లీహిల్స్‌తో ఏ సంబంధం లేకున్నా.. రెండు పార్టీలకు వ్యతిరేకంగా బై ఎలక్షన్ బరిలో నిలిచారు.

అలాగే… రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడంతో భూములు కోల్పోతున్న రైతులు, ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం లేదని నిరుద్యోగ జేఏసీ, ఎస్సీ వర్గీకరణతో నష్టపోయామని మాల సంఘాల ప్రతినిధులు., రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం… ఇలా ఎవరికి వారు జూబ్లీహిల్స్‌ బరిలో దిగి తమ నిరసనను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు.వాళ్ళంతా నామినేషన్స్‌ అయితే వేశారు సరే… నిజంగానే ప్రభావం చూపగలరా? ఎక్కడి నుంచో వచ్చిజూబ్లీహిల్స్‌లో నామినేషన్‌ వేస్తే… ఇక్కడి ఓటర్లు ఆదరిస్తారా? అంత మంది ఉన్నారు గనుక ఒకవేళ ఒకరో ఇద్దరో ప్రభావం చూపగలిగినా ఎవరికి నష్టం అన్న కోణంలో చర్చలు నడుస్తున్నాయి.

Silver: ఇంట్లో ఎంత వెండి ఉంచుకోవచ్చు?.. ఐటీ చట్టం ఏం చెబుతుందంటే?

అటు ప్రధాన పార్టీలు కూడా హోరాహోరీగా తలపడుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో హ్యాట్రిక్‌ కొట్టిన తమ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన ఉప ఎన్నికగనుక సిట్టింగ్‌ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది బీఆర్‌ఎస్‌. అలాగే… రెండేళ్ళ లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు చూపించాలని, దాని ద్వారా స్థానిక ఎన్నికల్లో లబ్ది పొందవచ్చన్న ప్లాన్‌ కూడా ఉంది గులాబీ పార్టీకి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నాం గనుక ఎట్టిపరిస్థితుల్లో గెలిచి సత్తా చాటాలని, తమ బలం తగ్గలేదని నిరూపించాలనుకుంటోంది. అందుకే… నియోజకవర్గ ఉపఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించడంతోపాటు ప్రతి డివిజన్‌కు ఇద్దరు మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించింది. ప్రతి పది పోలింగ్‌ బూత్​లకు ఒకరి లెక్కన బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వం ఉపఎన్నికలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ముందుకెళ్తోంది.

పరిస్థితి ఇంత టైట్‌గా.. నెక్‌ టు నెక్‌ అన్నట్టుగా ఉండి, ప్రతిఒక్క ఓటు అత్యంత ముఖ్యం అవుతున్న సందర్భంలో అలా… భారీ సంఖ్యలో బరిలో ఉన్న ఇండిపెండెంట్స్‌ ఎవరి కొంప ముంచుతారోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇక స్వతంత్ర అభ్యర్థుల్లో ఇద్దరికి బీఆర్ఎస్ పార్టీ సింబలైన కారును పోలిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్ సింబల్స్‌ వచ్చాయి.
దీనిపై గులాబీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే…ఈ సారి బరిలో ఉన్న అభ్యర్థుల పేరు, సింబల్స్ తో పాటు ఫస్ట్‌టైం ఈవీఎంలో ఫోటో కూడా పెట్టబోతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇలా… రకరకాల ట్విస్ట్‌లతో జాబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అత్యంత ఉత్కంఠభరితంగా మారుతోంది.

Exit mobile version