Site icon NTV Telugu

Odysse Evoqis: 4.32 kWh బ్యాటరీ, 3000W మోటార్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ బైక్ కేవలం రూ. 1.18 లక్షలకే లాంచ్..!

Odysse Evoqis Lite

Odysse Evoqis Lite

Odysse Evoqis: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఒడస్సీ (Odysse) తమ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఇవోక్విస్ లైట్ (Evoqis Lite) ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్‌ను రూ. 1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్స్ ఒదలయ్యాయి కూడా. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ 60V లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తూ.. అత్యధికంగా 75 కి.మీ. గంట వేగంను అందిస్తుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 90 కి.మీ. పరిధిని అందించగలదు. ఈ బైక్‌లో రీయర్ హబ్ మౌంటెడ్ మోటార్ ను ఉపయోగించారు. ఇక ఇదే బైకు స్టాండర్డ్ మోడల్‌కి 4.32kWh బ్యాటరీ, 3000W మోటార్ లభిస్తాయి. ఇవి 80 కి.మీ/గం టాప్ స్పీడ్, 140 కిమీ పరిధి కలిగి ఉంటాయి.

Read Also: Money Laundering Case: సోనియా గాంధీ, రాహుల్లకు షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ!

ఇవోక్విస్ లైట్‌కు కావాసాకి నింజా 300 వంటి స్పోర్టీ డిజైన్ కలిగి ఉంది. ఈ బైక్స్ 2 వేరియంట్లలో, 5 రంగులలో లభిస్తుంది, ఇందులో ముఖ్యంగా లైమ్ గ్రీన్ పెయింట్ స్కీమ్ లో ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. బైక్‌లో ట్విన్ LED హెడ్‌లాంప్స్, ట్రాన్స్‌పారెంట్ విండ్స్‌క్రీన్, ఫెరింగ్ మౌంటెడ్ ఇండికేటర్లు, క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్స్, స్లిట్ సీట్, స్టెప్పుడ్ అప్ పిలియన్ సీట్, ఫో స్సుల్ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. ఇంకా ఈ బైక్‌కి అనేక ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా.. మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, కీ లెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ లాకింగ్ సిస్టమ్, మోటార్ కట్-ఆఫ్ స్విచ్, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ లు లబిస్తాయి.

ఈ బైక్ లైమ్ గ్రీన్, మాగ్నా వైట్, ఫైర్ రెడ్, కోబాల్ట్ బ్లూ, బ్లాక్ లాంటి ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం బైక్‌లో వినియోగించిన సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థలపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే కంపెనీ తెలిపిన ప్రకారం ఇవి రోజువారీ ప్రయాణాలకు అనుగుణంగా కంఫర్ట్, హ్యాండ్లింగ్ లక్ష్యంగా రూపొందించబడ్డాయని తెలుస్తోంది. మొత్తంగా ఓడస్సీ ఇవోక్విస్ లైట్ మార్కెట్‌లో Revolt RV400, Oben Rorr, Ola Roadster వంటి ఇతర ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లతో పోటీ పడనుంది.

Read Also: Amaravati Relaunch: ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.. త్వరలో బీసీలకు కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న కృష్ణయ్య!

ఈ బైక్‌కు కస్టమైజేషన్ ఎంపికలు, రైడర్ కంఫర్ట్, సేఫ్టీ యాక్సెసరీస్ కూడా అందించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్ సైకిల్ 0-50 కి.మీ./గం. వేగాన్నికేవలం 4.2 సెకన్లలో అందుకోగలదని, గరిష్ట వేగం 80 కి.మీ./గం. వేగంతో దూసుకుపోతుందని కంపెనీ చెబుతోంది. లోడింగ్ కెపాసిటీ 170 కి.మీ.గా రేట్ చేయబడింది. ఒక్కసారి ఛార్జ్‌కి 100 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీని ఐదు గంటల్లో పూర్తిగా రీఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

Exit mobile version