NTV Telugu Site icon

Odisha Minister : కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూత

Naba Kishore Das

Naba Kishore Das

Odisha Minister : ఒడిశా ఆరోగ్య మంత్రి నబా దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా అతడిపై కాల్పులు జరపడంతో ఛాతిలో బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. డాక్టర్‌ దేబాశిస్‌ నాయక్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. గుండె, ఎడమ ఊపిరితిత్తుల వైపు దూసుకెళ్లిన బుల్లెట్‌ తీవ్ర గాయం చేయడంతో.. నవకిశోర్ దాస్ మృతిచెందినట్టు ప్రకటించారు.

Read Also: Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం

ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. వాహనం దిగుతున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దాడి వెనుక ఉద్దేశాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ఏఎస్ఐ మానసిక స్థితి సరిగా లేదని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రిపై కాల్పుల గురించి తెలిసిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్ వెంటనే స్పందించారు.

Read Also: U19 women’s worldcup : అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ విజేతగా టీమిండియా

బీజేడీలో సీనియర్ నేత అయిన నబకిశోర్‌ దాస్‌ ఓ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మంత్రిపై దాడులు జరగడం పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.